Site icon NTV Telugu

Pakistan Seeks US Help: తాలిబన్ల దాడితో గజగజలాడిన పాక్.. అగ్రరాజ్యాన్ని కాపాడాలని వేడుకున్న దాయాది

Pakistan Taliban Attacks

Pakistan Taliban Attacks

Pakistan Seeks US Help: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాస్తవంగా దాయాది దేశం తాలిబన్ల దాడితో గజగజలాడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు చెప్పుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తొమ్మిదవ యుద్ధాన్ని కూడా నివారిస్తారా అనేది ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతుంది. ఆఫ్ఘన్‌తో ఘర్షణలు, తాత్కాలిక కాల్పుల విరమణ నుంచి తలెత్తే ఉద్రిక్తతల మధ్య పాక్ సహాయం కోసం అమెరికా అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం.

READ ALSO: Anasuya : ఆ హీరో అంటే పిచ్చి.. ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకునేదాన్ని

ఒక ఇంటర్వ్యూలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాక్-ఆఫ్ఘన్ యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. “యుద్ధాలకు అమెరికా అధ్యక్షులు కారణమని నేను నమ్ముతున్నాను. కానీ యుద్ధాలను ఆపిన మొదటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గత 15 నుంచి 20 ఏళ్లుగా అమెరికా యుద్ధాలను స్పాన్సర్ చేసింది, కానీ శాంతి చర్చలు జరిపిన మొదటి అధ్యక్షుడు ట్రంప్. పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ యుద్ధంలో ఆయన మధ్యవర్తిత్వం వహించాలనుకుంటే , ఆయనకు స్వాగతం” అని అన్నారు.

ఇదే ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. తాలిబాన్ ప్రభుత్వం భారతదేశం తరపున పరోక్ష యుద్ధం చేస్తోందని సందేహం వ్యక్తం చేశారు . “తాలిబాన్ నిర్ణయాన్ని భారతదేశం స్పాన్సర్ చేస్తున్నందున కాల్పుల విరమణ కొనసాగుతుందా లేదా అని నాకు సందేహం ఉంది. ప్రస్తుతం, కాబూల్ భారతదేశం తరపున పరోక్ష యుద్ధం చేస్తోంది” అని అన్నారు. ఇదే సమయంలో ఈజిప్టులో జరిగిన గాజా శాంతి సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నాను. నేను వచ్చే వరకు వేచి ఉండాలి. యుద్ధాలను ఆపడంలో నేను నిపుణుడిని కాబట్టి నేను మరో యుద్ధాన్ని ఆపుతాను” అని అన్నారు.

ట్రంప్‌ ఆసక్తి వెనక కారణాలు ఉన్నాయా..
పాక్-ఆఫ్ఘన్ యుద్ధాన్ని ఆపడానికి ఆసక్తి చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే ఆయనకు ఏదైనా రహస్య ఎజెండా ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత నెలలో ఆఫ్ఘనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికాకు అప్పగించడానికి తాలిబన్లు నిరాకరించారు. అనంతరం పాక్-ఆఫ్ఘన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది. ఈ రెండు దేశాల మధ్యలోకి అగ్రరాజ్యం వస్తుందా.. వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

READ ALSO: US visa Interview Rules 2025: అమెరికా కల.. యూఎస్ వీసా ఇంటర్వ్యూలు మరింత కఠినతరం..

Exit mobile version