Pakistan: అసిమ్ మునీర్ చేతుల్లోకి పాకిస్తాన్.. సైన్యం వద్ద ‘‘న్యూక్లియర్ బటన్’’..
- పాకిస్తాన్లో నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ ఏర్పాటు.
- అసీమ్ మునీర్‌కు అణు కమాండ్‌పై అధికారం పెరిగే అవకాశం.
- ప్రధానమంత్రి పాత్ర సమాచార స్థాయికే పరిమితం కావచ్చని నివేదిక.
- చైనా PLA రాకెట్ ఫోర్స్ నమూనాలో కొత్త వ్యవస్థ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ నెమ్మదిగా సైనిక పాలన దిశగా వెళ్తోంది. నిజానికి ఆ దేశంలో ప్రజాస్వామ్యం, ప్రధాని, మంత్రులు ఉన్నారని చెబుతున్నప్పటికీ, వీరంతా సైన్యం సూచన మేరకే నడుచుకుంటారనేది నిజం. ఇదిలా ఉంటే, ఇప్పుడు దాయాది దేశంలో 27వ రాజ్యాంగ సవరణతో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశం మొత్తం పాక్ ఆర్మీ చీఫ్, సర్వసైన్యాధికారి అసిమ్ మునీర్ చేతుల్లోకి వెళ్తోంది. ఈ కొత్త రాజ్యంగా సవరణ ద్వారా పాక్ అణ్వాయుధాలపై పూర్తి ఆధిపత్యం అసిమ్ మునీర్‌కు చేతుల్లోకి రాబోతోంది.
కొత్త చట్ట సవరణతో నేషనల్ స్ట్రాటిజక్ కమాండ్(ఎన్ఎస్సీ)పేరుతో కొత్తగా ఒక సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశ అణ్వాయుధాలు, వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలు, వాటి నిర్వహణను ఒకే కమాండ్ కిందకు తెస్తోంది. ఇప్పటి వరకు అణ్వాయుధాలను ఉపయోగించే అధికారం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ కమాండ్ అథారిటీ (NCA) పర్యవేక్షించేది. అయితే కొత్త వ్యవస్థలో ప్రధానమంత్రి పాత్ర కేవలం సమాచారం తెలుసుకునే స్థాయికి మాత్రమే పరిమితమవుతుంది. నిర్ణయాధికారం అంతిమంగా సైన్యానిదే.
Also Read
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
- Truecaller Scam Checker: ఆన్లైన్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు Truecaller కొత్త ఫీచర్.. నంబర్, లింక్, మెసేజ్ అన్నీ ఒకేచోట చెక్..
ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF), చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) అనే రెండు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలోనే కొత్త వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఈ కొత్త వ్యవస్థ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) రాకెట్ ఫోర్స్ నమూనాను పోలి ఉంటుంది. స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ (SPD) సహకారంతో అణ్వాయుధ నిల్వలు, క్షిపణి వ్యవస్థలు, క్షిపణి అభివృద్ధి వంటి అంశాలను ఒకే కమాండ్ కిందకు తీసుకురానున్నారు.
ఇదే కాకుండా పాక్ సైన్యం, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రాకెట్ ఫోర్స్, స్ట్రాటజిక్ కమాండ్ మధ్య సమన్వయాన్ని పెంచడం, తూర్పు సరిహద్దు వద్ద వ్యూహాత్మక నిరోధక శక్తిని బలోపేతం చేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. ఇదే సమయంలో చైనా టెక్నాలజీని పాక్ సైన్యంలో మరింత పెంచాలని భావిస్తోంది. పాక్ సైన్యం ఈ పునర్వ్యవస్థీకరణ చేస్తున్న కారణంగా 15 నెలలుగా సీనియర్ సైనికాధికారుల పదోన్నతులు ఆలస్యమవుతున్నాయి. 2024 నుంచి ఫార్మేషన్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించలేదు. నివేదికల ప్రకారం పాక్ సైన్యంలో అత్యున్నత సైనిక నాయకత్వం వద్దే నిర్ణయాధికారం కేంద్రీకృతమవుతున్నాయి.
తాజావార్తలు
-
Share Nani Tag: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Bloody Romeo : నాని సరసన నాజూకు బ్యూటీ..
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!