NTV Telugu Site icon

Pakistan PM: ‘152/0 వర్సెస్ 170/0’.. భారత్‌ సెమీస్‌ ఓటమిపై పాకిస్థాన్‌ ప్రధాని వ్యంగ్యం

Pakistan Pm

Pakistan Pm

Pakistan PM: టీ20 వరల్డ్ కప్‌లో మొదటి నుంచి అద్భుతంగా రాణించిన టీమిండియా సెమీస్‌లో ఉసూరుమనిపించింది. టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరగడంతో క్రీడాభిమానులు నిరాశను వ్యక్తపరస్తున్నారు. మంచి ఊపుమీదున్న టీమిండియా.. ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్‌లో పాకిస్థాన్‌తో తలపడుతుందని భావిస్తే కథ అడ్డం తిరిగింది. ఒక్క వికెట్‌ తీయలేక భారత జట్టు చతికిలపడింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌పై చాలా మంది ట్వీట్లు చేస్తు్న్నారు. ఈ టోర్నీలో భారత్‌ ఓటమిపై పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వ్యంగ్యంగా స్పందించారు. “అదన్నమాట సంగతి… అయితే ఈ ఆదివారం 152/0 వర్సెస్ 170/0” అంటూ ట్వీట్ చేశారు.

Patanjali: ఉత్తరాఖండ్‌లో 5 పతంజలి మందులపై నిషేధం.. ఎందుకో తెలుసా?

170/0 అనేది ఇంగ్లండ్ ఓపెనర్లు భారత జట్టుపై సాధించిన స్కోరు కాగా.. 152/0 అనేది గతేడాది వరల్డ్‌ టోర్నీలో టీమిండియాపై పాక్‌ జట్టు సాధించిన స్కోరు. గతేడాది టీమిండియాను పాకిస్థాన్‌ ఓడిస్తే.. ఇప్పడు మళ్లీ అదే రీతిలో ఇంగ్లండ్ ఓడించిందని పాకిస్థాన్‌ ప్రధాని తన ట్వీట్‌ ద్వారా వ్యంగ్యంగా ఎత్తిపొడిచారు. పాకిస్థాన్‌, ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 13వ తేదీన ఆదివారం నాడు మెల్‌బోర్న్‌ వేదికగా ఫైనల్‌ సమరం జరగనుంది.

Show comments