Site icon NTV Telugu

Shahbaz Sharif Erdogan Meeting: భారత్ తో ఉద్రిక్తతల మధ్య.. పాకిస్తాన్ ప్రధాని టర్కీ అధ్యక్షుడితో తొలి సమావేశం

Shahbaz Sharif

Shahbaz Sharif

ఇస్తాంబుల్‌లోని డోల్మాబాహ్స్ వర్కింగ్ ఆఫీస్‌లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి మహ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య కీలక చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం క్లోజ్డ్ రూమ్ లో జరిగింది. ఈ సమావేశానికి తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్, రక్షణ మంత్రి యాసర్ గులెర్ కూడా హాజరైనట్లు ఎర్డోగన్ కార్యాలయం తెలిపింది. ఉగ్రవాదంపై భారత్ చర్య తీసుకున్న తర్వాత, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ టర్కీ, ఇరాన్, అజర్‌బైజాన్, తజికిస్తాన్ నాలుగు దేశాల పర్యటనకు వెళ్లారు. ఇది మే 25 నుంచి మే 30, 2025 వరకు కొనసాగనుంది.

Also Read:AP News : ఇద్దరు పిల్లల తల్లి(40)ని ప్రేమ వివాహం చేసుకున్న 25 ఏళ్ల యువకుడు.. చివరికీ..

ఈ అంశాలపై ఇద్దరు నాయకుల మధ్య చర్చ

ఇరుపక్షాలు వాణిజ్య పరిమాణాన్ని $5 బిలియన్లకు పెంచడానికి కట్టుబడి ఉన్నాయి. ఇంధనం, రవాణా, రక్షణ రంగాలలో సహకారాన్ని పెంచుకోవడంపై ఒప్పందం కుదిరింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రయత్నాలకు ప్రాధాన్యత. వీటిలో శిక్షణ, నిఘా సమాచారం పంచుకోవడం, సాంకేతిక సహకారం ఉన్నాయి. ఇస్తాంబుల్-టెహ్రాన్-ఇస్లామాబాద్ రైలు మార్గం సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని అధ్యక్షుడు ఎర్డోగన్ నొక్కి చెప్పారు. దృఢమైన సహకారానికి విద్యా రంగాన్ని కీలకంగా గుర్తించారు. పాకిస్తాన్ ప్రధానితో పాటు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఉన్నారు. విదేశాంగ, రక్షణ మంత్రులతో సహా టర్కిష్ ఉన్నతాధికారులు కూడా అధ్యక్షుడు ఎర్డోగన్‌కు మద్దతు ఇచ్చారు.

Also Read:Covid cases: దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్లు గుర్తింపు.. పెరుగుతున్న కేసులు..

పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్న టర్కీ

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, మే 7 తేదీన ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్ కూల్చివేసినప్పుడు ఎర్డోగన్ పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాడు. టర్కీ నుంచి వచ్చిన డ్రోన్లను ఉపయోగించి పాకిస్తాన్ భారత్ పై దాడి చేసింది. ఇది భారత్-టర్కిష్ సంబంధాలలో ఉద్రిక్తతలను మరింత పెంచింది.

Exit mobile version