Site icon NTV Telugu

Pakistan Players Fight: పొట్టుపొట్టు కొట్టుకున్న పాక్ ప్లేయర్స్.. షాక్‌లో పీసీబీ!

Pakistan Players Fight

Pakistan Players Fight

Pakistan Players Fight: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ షాన్ మసూద్‌, స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అంతేకాదు గొడవను ఆపడానికి వెళ్లిన సీనియర్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్‌ను కూడా వారు కొట్టారు. రిజ్వాన్‌కు దెబ్బలు తగిలాయని తెలుస్తోంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాక్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఘోర పరాజయం తర్వాత ఈ గొడవ జరిగింది.

పాకిస్తాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చారిత్రక విజయం సాధించింది. టెస్టు ఫార్మాట్‌లో పాక్‌పై బంగ్లా ఇదే తొలి గెలుపు. అంతేకాదు స్వదేశంలో టెస్టు ఫార్మాట్‌లో ప్రత్యర్థి చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమిపాలవ్వడం పాక్‌కు ఇదే మొదటిసారి. ఈ ఘోర ఓటమి అనంతరం పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలోనే షాన్ మసూద్‌, షాహిన్ అఫ్రిది గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవ జరగడానికి ముందు.. మైదానంలో తన భుజంపై షాన్ మసూద్ చేయి వేయగా అఫ్రిది కోపంతో తీసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!

షాన్ మసూద్‌, షాహిన్ అఫ్రిది గొడవతో పీసీబీ షాక్‌కు గురైంది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు ప్రతిష్ట మరింత దిగజారింది. రెండో టెస్టు తుది జట్టు నుంచి అఫ్రిదిని తప్పించారు. జట్టు కూర్పు కోసం అతడిని తప్పిస్తున్నామని కోచ్ గిలెస్పీ చెప్పినా.. అఫ్రిది దురుసు ప్రవర్తనే కారణమని తెలుస్తోంది. క మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అఫ్రిది 30 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే తీయగా.. షాన్ మసూద్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 20 పరుగులు చేశాడు.

Exit mobile version