Vyomika Singh : పాకిస్తాన్ తన దుర్మార్గపు చర్యలను ఏమాత్రం విరమించడం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. అంతేకాకుండా పాక్ ఫైటర్ జెట్లు పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయి. పంజాబ్‌లోని పలు కీలకమైన ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి. మానవత్వం మరిచి శ్రీనగర్‌లోని స్కూళ్లు, ఆసుపత్రులపై కూడా దాడులకు తెగబడుతోంది. రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను కూడా టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ తన పిరికి చర్యలకు పాల్పడుతోందని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Operation Sindoor: పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్తాన్ ఈ చర్యలు అత్యంత హేయమైనవిగా ఉన్నాయి. సైనిక స్థావరాలే కాకుండా పౌర ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకోవడం వారి దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోందన్నారు. పంజాబ్‌లోని ఎయిర్ బేస్‌లపై దాడులు చేయడం ద్వారా భారత వైమానిక శక్తిని బలహీనపరచాలని చూస్తోందని, ఇక శ్రీనగర్‌లోని విద్యా సంస్థలు, వైద్యాలయాలపై దాడులు చేయడం వారి మానవత్వం లేని చర్యలకు నిదర్శనమన్నారు. రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా భారత రక్షణ వ్యవస్థను దెబ్బతీయాలని పాకిస్తాన్ కుట్ర చేస్తోందని వ్యోమిక సింగ్ వివరించారు.
పాకిస్తాన్ ఈ వరుస దాడులు ప్రాంతీయంగా భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అమాయక ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పాకిస్తాన్ తెగింపు చర్యలకు పాల్పడుతోంది. అయితే భారత సైన్యం పూర్తి అప్రమత్తతతో ఉంటూ శత్రువుల ప్రతి చర్యను తిప్పికొడుతోంది.
Operation Sindoor Live Updates: పాకిస్తాన్ పై భారత్ మెరుపు దాడులు.. లైవ్ అప్డేట్స్
