NTV Telugu Site icon

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్స్ ఇవే.. అత్యంత నిలకడైన జట్టు పాకిస్తాన్!

T20 World Cup 2024 Title

T20 World Cup 2024 Title

Pakistan and West Indies have won T20 World Cup most times: అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత ఆకర్షణీయ టోర్నీ టీ20 ప్రపంచకప్‌ 2024 నేడు ఆరంభమైంది. వెస్టిండీస్‌తో కలిసి అగ్రరాజ్యం అమెరికా టీ20 ప్రపంచకప్‌కు తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. 8 అగ్రశ్రేణి జట్లకు తోడు మరో 12 టీమ్‌లు విశ్వ వేదికపై తమదైన ముద్ర చూపాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొమ్మిదో టి20 ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగనుంది. అమెరికా, కెనడా మధ్య మ్యాచ్ ఇప్పటికే ఆరంభమైంది.

టీ20 ప్రపంచకప్‌ 2007 ఆరంభం కాగా.. ప్రస్తుతం 9వ పొట్టి టోర్నీ జరుగుతోంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్లుగా ఇంగ్లండ్, వెస్టిండీస్‌ ఉన్నాయి. ఇంగ్లండ్ 2010, 2022లో ట్రోఫీ గెలవగా.. వెస్టిండీస్‌ 2012, 2016లో గెలిచింది. భారత్‌ (2007), పాకిస్థాన్‌ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) టీమ్స్ ఒక్కోసారి టైటిల్ సాధించాయి. పొట్టి టోర్నీలో వెస్టిండీస్‌ ప్రమాదక జట్టుగా పేరొందింది.

Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ ఆరంభం.. కెనడాతో అమెరికా ఢీ!

టీ20 ప్రపంచకప్‌లో అత్యంత నిలకడైన టీమ్ ఏదంటే.. పాకిస్థాన్‌ అని అందరూ చెప్పేస్తారు. పాక్ ఇప్పటివరకు 6 సార్లు సెమీస్‌ చేరింది. 2007, 2009, 2010, 2012, 2021, 2022లో పాక్ సెమీస్‌లో అడుగుపెట్టింది. 2009లో విశ్వ విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌ ఈసారి కూడా పటిష్టంగానే ఉంది. లేటుగా జట్టును ప్రకటించినా.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మంచి ఆటగాళ్లు ఉన్నారు.

Show comments