Site icon NTV Telugu

Pakistan-Iran Conflict: పాకిస్థాన్- ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య..

Iran Pak

Iran Pak

బలూచిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో సైనిక చర్యల కారణంగా తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్- ఇరాన్ అంగీకరించాయి. తీవ్రవాద లక్ష్యాలపై ఇటీవలి ఘోరమైన వైమానిక దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పటికే ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధంతో తీవ్ర సంక్షోభం ఎదురౌతుంది. కాగా, మంగళవారం రాత్రి పాకిస్థాన్‌లోని ‘ఉగ్రవాద’ లక్ష్యాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేయడంతో పరిస్థితి వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ గురువారం ఇరాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దులను మూసివేయడంతో స్థానిక జనాభాపై దాని ప్రభావం చూపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేశారు.

Read Also: Venkateswara Stotram: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది.

ఇక, ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. అయితే, చైనా మాత్రం పాక్- ఇరాన్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చింది. కానీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీతో పాటు ఇరాన్ కౌంటర్ హోస్సేన్ అమీర్- అబ్దుల్లాహియాన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ పరిస్థితిని తగ్గించడానికి ఇరు దేశాలకు మార్గం సుగమం చేసింది. అయితే, తీవ్రవాద వ్యతిరేకత, ఇరు దేశాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఇరాన్- పాకిస్థాన్ ఒప్పందాన్ని చేసుకున్నాయని ఇస్లామాబాద్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. పాకిస్తాన్- ఇరాన్ మధ్య ఉన్న బలూచిస్తాన్ ప్రాంతం చాలా కాలంగా ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది.

Exit mobile version