Site icon NTV Telugu

Pakistan: ఒక్క టమాటా రూ.75..! కొనేందుకు లోన్ ఇవ్వాలని పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఎంపీ డిమాండ్..!

Pak

Pak

Pakistan: పాకిస్థాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం అక్కడి పౌరులలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోగ్రాముకు రూ.600కి చేరింది. ఇది దాదాపు 400% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పరిస్థితులు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. తాజాగా ఈ సమస్య పార్లమెంటులో గందరగోళ పరిస్థితులకు దారితీసింది. టమాటాలు కొనడానికి రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీలు వ్యంగ్యంగా స్పందించారు. ‘టమోటా రుణాల’ కోసం డిమాండ్ చేశారు. గతంలో భారత్‌ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసేవాళ్లమంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఒక పాకిస్థాన్ ఎంపీ పార్లమెంట్‌కు టమాటాను తీసుకొచ్చారు. “నేను ఈ టమాటాను ఇక్కడికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. ఈ టమాటాను పొందిన మన ఎంపీ ఫరూఖ్ సాహిబ్ కు ధన్యవాదాలు. ఈ ఒక్క టమాటా ధర రూ. 75” అని వ్యాఖ్యానిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. య

READ MORE: Droupadi Murmu: ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన యుద్ధ విమానంలో రాష్ట్రపతి గగన విహారం

అక్టోబర్ 11 నుంచి పాకిస్థాన్ -ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో భారీ ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ వైమానిక దాడుల కారణంగా సరిహద్దులు మూతపడ్డాయి. దీంతో ధరలు పెరిగాయని భావిస్తున్నారు. సరిహద్దు మూసివేత 2,600 కిలోమీటర్ల సరిహద్దులో వాణిజ్యాన్ని నిలిపివేసిందని.. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని చెబుతున్నారు. పాక్-ఆఫ్ఘన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ ప్రకారం.. ప్రతిరోజూ, రెండు దేశాలు దాదాపు 1 మిలియన్ డాలర్లు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. నిలిచిపోయిన వార్షిక వాణిజ్యం 23 బిలియన్ డాలర్లు, ఇందులో తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, మందులు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు ఉన్నాయి. దీని ఫలితంగా పాకిస్థాన్ లో ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా కిలో టామోటా ధరల రూ.600కి పెరిగింది. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం.. వెల్లుల్లి ఇప్పుడు కిలోకు రూ.400, అల్లం రూ.750, ఉల్లిపాయలు రూ.120, బఠానీలు రూ.500, క్యాప్సికమ్, బెండకాయ రూ.300, దోసకాయ రూ.150, స్థానిక క్యారెట్లు రూ.200, నిమ్మకాయలు రూ.300 చొప్పున పెరిగాయి.

Exit mobile version