Site icon NTV Telugu

Pakistan : పాకిస్థాన్ లో ఉగ్రవాదుల దాడి.. 10 మంది పోలీసులు మృతి, ఆరుగురికి గాయాలు

New Project (23)

New Project (23)

Pakistan : ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నాయి. ఈ సమయంలో పాకిస్థాన్‌లో పలు చోట్ల హింస, ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.. బలూచిస్థాన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల పేలుడు ఘటన ఇంకా చల్లారలేదు.. మరోసారి ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో భీభత్సం సృష్టించారు. ఎన్నికలకు ముందు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలోని పోలీస్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడ్డారు. సీనియర్ పోలీసు అధికారి అనిసుల్ హసన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఉగ్రదాడిలో పది మంది పోలీసులు మరణించగా, 6 మంది గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులందరినీ ఆసుపత్రిలో చేర్పించారు.

Read Also:Virat Kohli: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మూడో టెస్టుకు విరాట్ కోహ్లీ దూరం!

సోమవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడ్డారని అధికారి తెలిపారు. ఈ సమయంలో గుర్తు తెలియని ఉగ్రవాదులు మొదట స్నిపర్ షాట్‌లు పేల్చి చౌదవాన్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పోలీసులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో పాటు హ్యాండ్‌ గ్రెనేడ్‌లను ప్రయోగించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో స్వాబీ ఎలైట్ పోలీసు యూనిట్‌కు చెందిన ఆరుగురు పోలీసులు ఉన్నారని, ఎన్నికల సమయంలో స్థానిక పోలీసులకు సహాయం చేయడానికి ఈ ప్రాంతంలో మోహరించినట్లు చెబుతున్నారు. దాడి తర్వాత ఇక్కడ యంత్రాంగం అప్రమత్తమైంది. దక్షిణ వజీరిస్థాన్ గిరిజన జిల్లా, డేరా ఘాజీ ఖాన్‌కు వెళ్లే రహదారులపై భారీ శోధన ఆపరేషన్ నిర్వహించబడుతోంది. వచ్చే, వెళ్లే ప్రతి వ్యక్తిని నిశితంగా పరిశీలిస్తున్నారు. జూలై 4 ఆదివారం బలూచిస్తాన్‌లోని నుష్కీ జిల్లాలోని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ECP) కార్యాలయం వెలుపల మరో బాంబు పేలుడు జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. అయితే ఈసీపీ కార్యాలయం గేటు బయట జరిగిన పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి నేరస్తులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also:Mark Zuckerberg : జుకర్‌బర్గ్ రికార్డు.. ఒక్కరోజులో రూ.2.33 లక్షల కోట్లు సంపాదన

Exit mobile version