Site icon NTV Telugu

Pakistan flash floods: పాక్‌లో ఘోరం.. 24 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు

03

03

Pakistan flash floods: పాకిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వరదల్లో కనీసం 24 మంది మరణించగా, అనేక మంది గల్లంతైనట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లోయర్ దిర్, బజౌర్, అబోటాబాద్‌తో సహా అనేక జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి.

READ MORE: Massive Cloudburst: స్వాతంత్ర్య దినోత్సవం వేళ మృత్యుఘోస.. 65కు చేరిన మృతుల సంఖ్య..

ఉప్పొంగిన పంజ్‌కోరా నది.. .
నిరంతర వర్షాల కారణంగా పంజ్‌కోరా నది నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిందని అధికారులు తెలిపారు. బజౌర్ జిల్లాలో, జబ్రారి, సలార్జాయ్ ప్రాంతాలలో ఆకస్మిక వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. లోయర్ డిర్ మైదానంలోని సోరిపావోలో ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు మరణించగా, మహిళలు, పిల్లలు సహా నలుగురు గాయపడ్డారు. శిథిలాల నుంచి ఏడుగురిని సహాయక సిబ్బంది బయటకు తీయగా, వారిలో ఐదుగురు చనిపోయినట్లు ప్రకటించారు.

జబరారి గ్రామంలో భారీ వరదలు
జబ్రారి గ్రామంలో సంభవించిన భారీ వరదల్లో సుమారు 17 మంది గల్లంతైనట్లు సమాచారం. ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలు, నలుగురు గాయపడిన వారిని వెలికితీశారు. రెస్క్యూ బృందాలు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించిన తర్వాత స్థానిక ఆసుపత్రికి తరలించారు. బజౌర్ జిల్లా అత్యవసర అధికారి అమ్జద్ ఖాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సలార్జాయ్‌లో తొమ్మిది మంది మరణించారని, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఖార్ ఆసుపత్రికి తరలించారని డిప్యూటీ కమిషనర్ షాహిద్ అలీ తెలిపారు.

READ MORE: AP Free Bus Scheme: బస్సులో సీఎం, డిప్యూటీ సీఎం ప్రయాణం.. జీరో టికెట్ ఇచ్చిన చంద్రబాబు

Exit mobile version