Site icon NTV Telugu

Khawaja Asif: “భారత్ మళ్ళీ సరిహద్దు దాటి దాడి చేస్తుంది.” పాక్ ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన..

Pakistan Defence Minister Khawaja Asif

Pakistan Defence Minister Khawaja Asif

Khawaja Asif: పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ మరోసారి భయంతో వణుకుతోంది. భారత్ మళ్ళీ పాకిస్థాన్ పై దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా పేర్కొ్న్నారు. భారత ఆర్మీ చీఫ్ ప్రకటనను తోసిపుచ్చలేమని ఖవాజా ఆసిఫ్ అన్నారు. భారత్ మరోసారి సరిహద్దు దాటి దాడి చేయవచ్చని జోష్యం చెప్పారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ… తప్పుడు కూతలు కూశారు. ఆఫ్ఘనిస్థాన్ చొరబాట్లను ప్రేరేపిస్తుందని, ఇందులో భారత్ పాత్ర పోషిస్తుందని నిరాధారమైన ఆరోపణలు చేశారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, చైనా, ఇతర దేశాలు పాకిస్థాన్‌లోకి సరిహద్దు చొరబాట్లను ఆపాలని కోరుకుంటున్నాయన్నారు. కాబూల్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని పేర్కొంటూ.. ఆఫ్ఘనిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాక్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల సమస్యలను పరిష్కరించుకోవడం భారతదేశానికి ఇష్టం లేదని ఆరోపించారు. పాకిస్థాన్ రెండు వైపులా ఘర్షణలో చిక్కుకోవచ్చని, భారత్ యుద్ధ ప్రమాదాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు. భారత్ మరోసారి సరిహద్దు దాడి దాడికి దిగవచ్చని ఖవాజా ఆసిఫ్ తెలిపారు.

READ MORE: Govt Jobs 2025: లక్షల్లో జీతాలు వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

ఇంతకీ భారత ఆర్మీ చీఫ్ ఏమన్నారు..?
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ పాకిస్థాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పాకిస్థాన్ తో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్థాన్ లాంటి దేశాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. చర్చలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఒకేసారి జరగవని తెలిపారు. పాకిస్థాన్ శాంతియుత ప్రక్రియను అలవరుచుకోవాలని అందుకు భారత్ కూడా సహకరిస్తుందని స్పష్టం చేశారు. “ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. ఇది 88 గంటల పాటు సాగింది. పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే ఏ క్లిష్టపరిస్థితిపైనా భారత్ సమర్థవంతంగా ఎదుర్కుంటుంది. పాకిస్థాన్ అవకాశం ఇస్తే.. సరిహద్దు దేశంతో ఎలా నడుచుకోవాలో ఆ దేశానికి వివరిస్తాం” అని భారత ఆర్మీ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ తెలిపారు. పాకిస్థాన్ లాంటి ఉగ్రవాద ప్రోత్సాహ దేశంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్.. పురోగతి, అభివృద్ధి కోసం పాటుపడుతుందని తెలిపారు. తమ దారికి అడ్డొస్తే వారిపై చర్యలు ఎలా తీసుకోవాలో తమకు తెలుసని స్పష్టంచేశారు.

Exit mobile version