పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రస్తుత అధికార పక్షం సభ్యులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి అందిన కానుకల విషయంలో కేవలం 20 శాతం డబ్బు కట్టి రూ. 5.7కోట్లను ఇమ్రాన్ సొమ్ము చేసుకున్నారని మండిపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించి మరో దుబారా ఖర్చును ప్రభుత్వ నేతలు బహిర్గతం చేశారు.
ఇమ్రాన్ తన ప్రభుత్వ హయాంలో ప్రధాని నివాసం నుంచి బానీగాలాలోని ప్రైవేటు నివాసానికి ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని హెలికాప్టర్ ద్వారా సాగించిన రాకపోకల ఖర్చు రూ.40 కోట్లు అయినట్లు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ ప్రకటించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2018 జూన్ నుంచి 2022 మార్చి వరకు ఇమ్రాన్ ఖాన్ హెలికాప్టర్ ఖర్చు కింద రూ.40 కోట్లు వాడుకున్నారని ఔరంగజేబ్ వివరించారు. ఇందులో ప్రయాణ ఖర్చు 472 మిలియన్లు కాగా నిర్వహణకు 512 మిలియన్ల ఖర్చు చేశారని ఆరోపించారు.
మరోవైపు భారత విదేశాంగ విధానాన్ని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి కీర్తించారు. భారత్ తన ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు. ఇతర దేశాలకు ప్రయోజనం చేకూర్చే ముందు తన సొంత ప్రయోజనాల గురించి భారత్ ఆలోచించుకుంటుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. కానీ పాకిస్థాన్ విదేశాంగ విధానం మాత్రం ఇతరులకు మేలు చేసేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Threats to Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ప్రాణ హాని..! పాక్ ప్రధాని కీలక ఆదేశాలు