Pakistan vs Hongkong: షార్జాలో శుక్రవారం జరిగిన ఆసియా కప్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో హాంకాంగ్‌పై రికార్డు స్థాయిలో 155 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ చిరకాల ప్రత్యర్థి భారత్‌పై మరోసారి తలపడనుంది. మహ్మద్ రిజ్వాన్ 57 బంతుల్లో 78 పరుగులతో చెలరేగిపోయాడు. ఫఖర్ జమాన్ కూడా 53 పరుగులతో అద్భుతంగా ఆడాడు. ఖుష్‌దిల్(35 నాటౌట్) చివర్లో చెలరేగి ఆడాడు. కెప్టెన్ బాబర్ అజామ్ (9 బంతుల్లో 8) టోర్నీలో ఇన్ని ఇన్నింగ్స్‌లలో తన రెండో వైఫల్యాన్ని చవిచూశాడు. హాంకాంగ్‌పై పాకిస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
నంతరం బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ జట్టు కేవలం 10 ఓవర్లలో 38 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో షాబాద్ ఖాన్ 4, మహమ్మద్ నవాజ్ 3, నసీమ్ షా 2 వికెట్లతో హాంకాంగ్‌ను వణికించారు. టీ-20 ఫార్మాట్‌లో పాకిస్తాన్‌కు ఇది అతిపెద్ద విజయం. రిజ్వాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇదే గ్రూప్‌లో ఉన్న భారత్ రెండు విజయాలతో తొలుత సూపర్-4కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక గ్రూప్-బి నుంచి అఫ్గాన్, శ్రీలంక జట్లు సూపర్-4కు చేరుకున్నాయి. సూపర్-4లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ జట్లు ఈ నెల 4న మరోసారి తలపడనున్నాయి.
Asia Cup 2022: టీమిండియాకు ఎదురుదెబ్బ.. గాయంతో ఆసియా కప్‌కు జడేజా దూరం
గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌తో పాకిస్తాన్ ఆదివారం తలపడనుంది. హాంకాంగ్ భారత్‌పై బ్యాటింగ్‌తో కొంత సామర్థ్యాన్ని ప్రదర్శించింది, కానీ వారు పాకిస్తాన్ బౌలింగ్ దాడికి లొంగిపోయారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో నసీమ్ షా రెండు వికెట్లు తీసి పాక్ విజయాన్ని సులువు చేశారు. ఆ తర్వాత స్పిన్నర్లు షాదాబ్ ఖాన్ ( 4), మహ్మద్ నవాజ్ (3) తీసి పాక్‌ను విజయ తీరాలకు చేర్చారు. షాదాబ్‌ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో హాంకాంగ్ ఇన్నింగ్స్‌ను సరళంగా ముగించాడు.
