Site icon NTV Telugu

Pakistan: “డొనాల్డ్ ట్రంప్‌- ఆసిమ్ మునీర్ లంచ్”.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదు..

Asim Munir

Asim Munir

Pakistan: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీ అయ్యారు. వైట్ హౌజ్‌లో ట్రంప్‌, మునీర్‌కి లంచ్ ఆతిథ్యం ఇచ్చారు. ఇజ్రాయిల్-ఇరాన్ సంఘర్షణ సమయంలో ఈ భేటీ జరిగింది. ఇరాన్ గురించి పాకిస్తాన్‌కి అందరి కన్నా బాగా తెలుసు అని ట్రంప్ విలేకరులతో అన్నారు. ట్రంప్‌తో జరిగిన భేటీలో ఆసిమ్ మునీర్‌తో పాటు ఐఎస్ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్ కూడా పాల్గొన్నారు.

Read Also: Ayatollah Ruhollah Khomenei: ఇరాన్ సుప్రీం లీడర్ తాత మన భారతీయుడే..

ఇదిలా ఉంటే, ట్రంప్‌తో ఆసిమ్ మునీర్ లంచ్ చేయడంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నెటిజన్లు పాకిస్తాన్, ఆసిమ్ మునీర్ పరువు తీస్తున్నారు. ‘‘ఆసిమ్ మునీర్ తన జీవితంలో ఇంత మంచి భోజనం తినలేదేమో’’ అంటూ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని యూజర్లు హైలెట్ చేస్తున్నారు. ‘‘ట్రంప్, మునీర్ బిర్యానీతో ప్రపంచశాంతికి మధ్యవర్తిత్వం వహిస్తారు’’ అని మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ఎక్స్‌లో ఒక యూజర్.. ‘‘ సమయం వచ్చినప్పుడు పాకిస్తాన్ ఇరాన్‌ను వెన్నుపోటు పొడిచేందుకు ట్రంప్ ఆసిమ్ మునీర్‌కు ఉచితంగా భోజనం ఇస్తున్నాడు’’ అని కామెంట్ చేశారు. 3 ఇడియట్ సినిమాలో అమీర్ ఖాన్ తన ఫ్రెండ్స్‌తో పెళ్లికి వెళ్లి భోజనం చేస్తున్న చిత్రాన్ని ట్రంప్, మునీర్‌లో పోల్చారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి, పేదరికంపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. మరో వైరల్ క్లిప్‌లో ‘‘ నువ్వు నీ జీవితంలో ఇలాంటి కేక్ ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు, నేను నిన్ను రుచి చూసేలా చేస్తాను’’ అని పాక్ పేదరికాన్ని ఎత్తి చూపారు.

Exit mobile version