Site icon NTV Telugu

Khawaja Asif: ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్ సాయం చేస్తోందట.. పాక్ రక్షణ మంత్రి పిచ్చికూతలు..!

Pakistan Defence Minister Khawaja Asif

Pakistan Defence Minister Khawaja Asif

Khawaja Asif:గత కొద్ది రోజులగా పాక్- ఆఫ్ఘన్ మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులు మరణించారు. పాకిస్థాన్‌కి చెందిన సైనికులు తమకు లొంగిపోయారని ఆఫ్ఘనిస్థాన్ చెబుతోంది. అయితే.. ఈ యుద్ధంపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ భారతదేశంపై వింత వాదనను చేశారు. న్యూఢిల్లీ(భారత్) తాలిబాన్లను స్పాన్సర్ చేస్తోందని, పాకిస్థాన్‌పై పరోక్ష యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలపై భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు..

READ MORE: EPFO: కొత్త మార్గ దర్శకాలను విడుదల చేసిన ఈపీఎఫ్ఓ

అనంతరం ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. తాలిబన్ల నియంత్రణలో ఉన్న ఉత్తర పొరుగు దేశంతో ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ చూపాలని తెలిపారు. ఆయన గతంలో చేసిన శాంతి ప్రయత్నాలను ప్రశంసించారు. ప్రస్తుత చర్చలలో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని బహిరంగంగా స్వాగతించారు. పాకిస్థాన్, తాలిబన్ల మధ్య శాంతి చర్చలలో ట్రంప్ పాత్ర గురించి రిపోర్టర్ ప్రశ్నించగా.. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అమెరికా నాయకుడిని ప్రశంసించారు. ట్రంప్ దేశాల మధ్య శాంతిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారని ఏడు యుద్ధాలను ముగించేందుకు శాంతి చర్చలు జరిపారని అన్నారు. “అమెరికాలో అధ్యక్షులు యుద్ధాలకు బాధ్యులని నేను భావిస్తున్నాను. కానీ యుద్ధాలను ఆపిన మొదటి అధ్యక్షుడు (ట్రంప్). గత 15-20 సంవత్సరాలలో అమెరికా పలు యుద్ధాలను స్పాన్సర్ చేసింది. కానీ.. శాంతి చర్చలు జరిపిన మొదటి అధ్యక్షుడు ఆయన (ట్రంప్). పాకస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాన్ని ఆయన పరిశీలించాలనుకుంటే.. స్వాగతం పలుకుతాం” అని జియో టీవీ ఇంటర్య్వూలో ఆసిఫ్ పేర్కొన్నారు.

READ MORE: Bengaluru: వైద్య వృత్తికే మాయని మచ్చ.. భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్

కాగా.. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రికత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దుల వద్ద తీవ్రమైన కాల్పులు జరిపాయి. ఈ దాడుల్లో ఇరు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య 48 గంటల పాటు ‘‘కాల్పుల విరమణ’’ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘాన్ దాడులు తట్టుకోలేక, పాకిస్తాన్ మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. సౌదీ అరేబియా, ఖతార్ దేశాలను రెండు దేశాల మధ్య మిడియేషన్ చేయాలని, ఆఫ్ఘాన్ దాడులు ఆపేలా చేయాలని పాకిస్తాన్ కోరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 48 గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.

Exit mobile version