Site icon NTV Telugu

NZ vs PAK: దెబ్బ మీద దెబ్బ.. రెండో టీ20లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ చిత్తు

Nzvspk

Nzvspk

ఇటీవల ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో పేలవమైన ప్రదర్శనతో విమర్శలపాలైంది పాక్ జట్టు. దాన్నుంచి కోలుకోకముందే పాక్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన రెండో టీ20లో సల్మాన్ అఘా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు 11 బంతులు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు 0-2 తేడాతో వెనుకబడి పోయింది. దూకుడుగా ఆడిన టిమ్ సీఫెర్ట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Also Read:Rashmika : నా కల ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు

తొలి టీ20లో 59 బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ ను 15 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ పాకిస్తాన్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బరిలోకి దిగిన పాకిస్తాన్ కు శుభారంభం లభించలేదు. జాకబ్ డఫీ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్ హసన్ నవాజ్ ను మార్క్ చాప్మన్ క్యాచ్ తో ఔట్ చేశాడు. నవాజ్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

Also Read:Sunita Williams: చిరునవ్వుతో భూమిపై అడుగుపెట్టిన సునీత.. వీడియో వైరల్

కివీస్ బౌలర్లు విజృంభించి పాకిస్తాన్‌కు షాక్‌లు ఇచ్చారు. పాకిస్తాన్ జట్టులో టాప్ స్కోరర్ కెప్టెన్ సల్మాన్ ఆఘా, అతను 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. షాదాబ్ ఖాన్ (26), షాహీన్ అఫ్రిది (22*) కూడా సహకారాన్ని అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, బెన్ సియర్స్, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి తలా రెండు వికెట్లు పడగొట్టారు. హారిస్ రౌఫ్ (1) రనౌట్ అయ్యాడు. 15 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Also Read:Uttar Pradesh: ప్రియుడితో కలిసి మర్చంట్ నేవీ అధికారిని చంపిన భార్య.. ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్ పోసిన వైనం

136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు టిమ్ సీఫెర్ట్ (45), ఫిన్ అల్లెన్ (38) 66 పరుగుల భాగస్వామ్యంతో మంచి ఆరంభాన్ని అందించారు. అఫ్రిది వేసిన ఓవర్లో సీఫెర్ట్ నాలుగు సిక్సర్లు కొట్టాడు. సీఫెర్ట్ కేవలం 22 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. తర్వాత జహందాద్ ఖాన్ అలెన్‌ను LBWగా అవుట్ చేయడం ద్వారా కివీస్ జట్టుకు షాక్ ఇచ్చాడు. అలెన్ కేవలం 16 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. ఆతిథ్య జట్టు కివిస్ 11 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది.

Exit mobile version