Site icon NTV Telugu

Pakistan: పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. ఆఫ్ఘనిస్థాన్‌తో ‘ఓపెన్ వార్’ ప్రకటన.. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు!

Open War

Open War

Pakistan: ఎప్పుడూ ఖయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్ మరోసారి ఉద్రిక్తతలు పెంచేందుకు సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. తాజాగా ఇరు దేశాల సరిహద్ద వద్ద దాడులు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. ఇస్లామాబాద్ ప్రభుత్వం దీన్ని ఓపెన్‌ వార్ గా ప్రకటిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తతగా మారాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశాడు. “మా సహనం ముగిసింది. ఇప్పుడు ఇది బహిరంగ యుద్ధం” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య పరిస్థితి ఎంత తీవ్రమైందో చూపిస్తున్నాయి.

READ MORE: Virosh wedding : ఎట్టకేలకు ఒక్కటైన ‘విరోష్’.. నా భర్త విజయ్ దేవరకొండ అంటూ రష్మిక ఎమోషనల్ పోస్ట్!

కాగా.. గత ఆదివారం ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిందని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఆ దాడుల్లో పలు మంది మరణించారని పేర్కొంది. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘాన్ సైన్యం గురువారం రాత్రి పాకిస్థాన్ సరిహద్దు పోస్టులపై దాడి చేసి, డజను పైగా ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. ఈ భూదాడిలో తమ ఎనిమిది మంది సైనికులు మరణించినట్లు ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో శుక్రవారం పాకిస్థాన్ కాబూల్, కందహార్, పక్తియా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. కాబుల్‌లో కనీసం మూడు పేలుళ్లు వినిపించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘాన్ వైపు నుంచి కాల్పులు జరగడంతోనే ఈ దాడులు జరిపామని పాకిస్థాన్ సైన్యం చెబుతోంది. Attaullah Tarar ప్రకారం.. కాబూల్, కందహార్, పక్తియాలోని తాలిబాన్ రక్షణ లక్ష్యాలపై దాడులు జరిగాయి. “ఆపరేషన్ ఘజబ్ లిల్ హక్” పేరుతో ఈ చర్యలు చేపట్టినట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం, రెండు బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలు, ఒక కార్ప్స్ హెడ్‌క్వార్టర్, గోలాల గోదాంలు ధ్వంసమైనట్లు పేర్కొంది. అయితే ప్రాణనష్టంపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహన్ నఖ్వీ కూడా ఆఫ్ఘాన్ తాలిబాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుందని తీవ్రంగా విమర్శించారు. “దేశ భద్రతను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదంలో పడనివ్వం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘర్షణలో నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్ ఓపెన్ వార్ ప్రకటించడం ఆందోళన కరంగా మారింది.

READ MORE: Toxic : రన్ టైం విషయంలో ‘ధురంధర్ 2’ తో పోటీ పడుతున్న ‘టాక్సిక్’..

Exit mobile version