Site icon NTV Telugu

Pakistan: క్రికెట్ ఆడమంటే హోటల్‌లో ఇవేం పనులు రా.. హౌస్‌కీపింగ్ మహిళను పాకిస్థాన్ ప్లేయర్ ఏం చేశాడంటే?

Pakisthan

Pakisthan

Pakistan Cricketer Controversy: టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ఆట గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. మొదట్లో తాము కప్పు కొట్టేస్తామని విర్రవీగిన దాయాది జట్టు సూపర్ 8 మ్యాచ్‌లో ఇంటికి పయనమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ టీమ్‌కి సంబంధించి ఓ ప్లేయర్‌పై తీవ్ర విమర్శలు ఇచ్చాయి. పాక్ జట్టులోని ఓ ఆటగాడు హోటల్‌లో పనిచేసే మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జట్టు ప్రతిష్ఠకు మరోసారి దెబ్బతీసేలా మారింది. శ్రీలంకలోని కాండీ నగరంలో ఉన్న ఒక హోటల్‌లో పాకిస్థాన్ జట్టు తాత్కాలికంగా బస చేసింది. అదే సమయంలో ఓ ప్లేయర్ హౌస్‌కీపింగ్ విభాగంలో పనిచేసే మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ ప్లేయర్ ప్రవర్తనతో భయపడిన ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. దీంతో సిబ్బంది వెంటనే స్పందించారు. అక్కడికి చేరుకుని ఆ మహిళను రక్షించారు. అనంతరం ఈ విషయాన్ని పాకిస్థాన్ జట్టు మేనేజర్ నవైద్ చీమాకు తెలియజేశారు.

READ MORE: Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..

ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆటగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే జట్టు మేనేజర్ ఆ ఆటగాడి తరఫున క్షమాపణలు చెప్పి విషయం అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. అంతేకాదు, ఆ ఆటగాడిపై జరిమానా కూడా విధించినట్టు చెబుతున్నారు. సూపర్ 8లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్ జరిగే ముందు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టెలికాం ఆసియా స్పోర్ట్ నివేదించింది. ఈ ఘటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం విచారణ జరిపే అవకాశముంది. ఆ ఆటగాడిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్కడ ఆ ప్లేయర్‌పై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు? అనే వివరాలు బయటకు రాలేదు. విదేశీ పర్యటనల సమయంలో పాకిస్థాన్ జట్టుకు ఇలాంటి విభేదాలు కొత్తవేం కాదు.. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో పాకిస్థాన్ యువ జట్టు తరఫున ఆడిన యువ బ్యాటర్ హైదర్ అలీపై ఒక యువతిపై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేసినప్పటికీ సరైన ఆధారాలు లభించకపోవడంతో తరువాత విడుదల చేసినట్టు సమాచారం.

Exit mobile version