NTV Telugu Site icon

PSL 2024: మ్యాచ్‌ మధ్యలో ఆ పని చేసిన పాకిస్తాన్ క్రికెట‌ర్.. వీడియో వైరల్‌!

Imad Wasim Cigarette

Imad Wasim Cigarette

Imad Wasim Smokes A Cigarette In PSL 2024 Final: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎసీఎల్‌) 2024 ఫైనల్‌లో ముల్తాన్ సుల్తాన్‌పై విజయం సాధించిన ఇస్లామాబాద్‌ యునైటడ్‌ టైటిల్ సాదించింది. ఇస్లామాబాద్‌ విజయంలో ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో తన కోటా 4 ఓవర్లలో 23 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌లో కీలకమైన 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇమాద్‌ ఆల్‌రౌండ్ ప్రదర్శనకు గాను అతడికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. పీఎసీఎల్‌ 2024 ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసి అందరిని అకట్టుకున్న ఇమాద్‌.. ఓ పాడు పని చేసి విమర్శల పాలయ్యాడు.

పీఎసీఎల్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుండగా ఇమాద్‌ వసీం డ్రెసింగ్‌ రూంలో సిగరెట్ తాగాడు. ఇస్లామాబాద్‌ యునైటడ్‌ డ్రెసింగ్‌ రూంలో ఎంచక్కా సిగరెట్ అంటించుకుని, దాన్ని తాగుతూ ఎంజాయ్ చేశాడు. ఈ తతంగాన్ని కెమెరామెన్ బంధించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురుపిస్తునారు. ‘మ్యాచ్ జరుగుతుండగా ఇదేం పాడు పని’, ‘ఇమాద్‌ వసీంపై కఠిన చర్యలు తీసుకోవాలి’, ‘పీఎసీఎల్‌ అంటే.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కాదు పాకిస్తాన్‌ స్మోకింగ్‌ లీగ్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: IPL 2024: విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్.. ప్రాక్టీస్‌లో బిజీబిజీ!

పాకిస్తాన్ జట్టులో ఇమాద్‌ వసీం కీలక ఆటగాడిగా ఎదిగాడు. పాక్ తరఫున 55 వన్డేలు, 66 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్లలో 1300 పరుగులు, 109 వికెట్స్ పడగొట్టాడు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇమాద్‌ టీ20 స్పెషలిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. పీఎసీఎల్‌ 2024 ఫైనల్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 రన్స్ చేసింది. ఛేదనలో ఇస్లామాబాద్‌ యునైటడ్‌ 20 ఓవర్లలో 8 వికెట్స్ కోల్పోయి 163 రన్స్ చేసి గెలిచింది.

Show comments