Babar Azam: పాక్ క్రికెట్లో కొత్త శకం.. బాబర్ అజామ్ ఔట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కొత్త మార్పులకు నాంది పలుకుతూ యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తోంది పీసీబీ. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ గాయం కారణంగా దూరం కావడంతో, ఇద్దరు యువ ఆటగాళ్లకు టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ క్రికెట్లో కొత్త శకానికి సంకేతంగా మారింది.
మీర్పూర్ టెస్టుతో కొత్త ఆరంభం
బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ మే 8న ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి భవిష్యత్తు జట్టును తయారు చేసే దిశగా అడుగులు వేసింది. మోకాలి గాయం కారణంగా మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో యువ బ్యాట్స్‌మెన్ అబ్దుల్లా ఫజల్, అజాన్ అవైస్లకు జట్టులో చోటు దక్కింది.
Also Read
- Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
- Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
- CJP 2.0: సీజేపీ నెక్స్ట్ మూవ్ ఏంటి..? అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
- Israel: ఇజ్రాయెల్-వియన్నా విమానానికి బాంబ్ బెదిరింపు.. ఎమర్జెన్సీ కోడ్‌తో అలర్ట్
అబ్దుల్లా ఫజల్ ఎవరు?
23 ఏళ్ల అబ్దుల్లా ఫజల్ కరాచీకి చెందిన ఎడమచేతి వాటం ఓపెనర్. దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటివరకు 25 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఫజల్ 41.54 సగటుతో 1,828 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 182. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం, బలమైన టెక్నిక్ అతనికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.
అజాన్ అవైస్పై భారీ అంచనాలు
21 ఏళ్ల అజాన్ అవైస్‌ను పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తు స్టార్‌గా భావిస్తున్నారు. సియాల్కోట్కు చెందిన ఈ యువ బ్యాట్స్‌మన్ ఇప్పటికే దేశీయ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అజాన్ 2,673 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని బ్యాటింగ్ సగటు 48.60 కాగా, అత్యధిక స్కోరు 203 నాటౌట్.
యువతతో పాటు అనుభవానికి ప్రాధాన్యం
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులను కూడా జట్టులో కొనసాగించింది. కెప్టెన్ షాన్ మసూద్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఇమామ్-ఉల్-హక్, అజాన్ అవైస్, అబ్దుల్లా ఫజల్, షాన్ మసూద్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా ఉన్నారు. బౌలింగ్‌లో అనుభవజ్ఞుడు మహ్మద్ అబ్బాస్‌కు మళ్లీ అవకాశం లభించింది. అతనితో పాటు షాహీన్ అఫ్రిది, హసన్ అలీ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు చేపట్టారు. స్పిన్ విభాగాన్ని నోమాన్ అలీ నడిపిస్తున్నాడు.
బంగ్లాదేశ్ జట్టులో టాస్కిన్ రీఎంట్రీ
ఇక ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టులో టాస్కిన్ అహ్మద్‌కు తిరిగి చోటు లభించింది. గాయం నుంచి కోలుకున్న అతను డిసెంబర్ 2024 తర్వాత ఆడుతున్న తొలి టెస్ట్ ఇదే కావడం విశేషం.
11 సభ్యుల బంగ్లాదేశ్ జట్టు: మహ్మదుల్ హసన్ జాయ్, షద్మాన్ ఇస్లాం, మోమినుల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, టాస్కిన్ అహ్మద్, నహిద్ రానా, ఇబాదత్ హొస్సేన్.
11 సభ్యుల పాకిస్థాన్ జట్టు: ఇమామ్-ఉల్-హక్, అజాన్ అవైస్, అబ్దుల్లా ఫజల్, షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, నోమాన్ అలీ, హసన్ అలీ, మహ్మద్ అబ్బాస్.
తాజావార్తలు
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
-
Solar-Powered Cart: వీధి వ్యాపారుల కోసం సోలార్ బండి.. డిజిటల్ పేమెంట్స్‌తో ఐఐటీ ఖరగ్‌పూర్ కొత్త ఆవిష్కరణ!
-
Shafali Verma: రాత్రంతా నిద్రపోలేదు.. దాని గురించే ఆలోచించా.. షఫాలీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
ట్రెండింగ్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!