NTV Telugu Site icon

Pakistan: పాక్ వైమానిక దాడులు.. 8 మంది మృతి

Pak

Pak

పొరుగు దేశంపై పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడికి పాకిస్థాన్‌ ప్రతీకారం తీర్చుకొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.ఆఫ్ఘనిస్తాన్ ముష్కరులకు ఆశ్రయం కల్పిస్తుందన్న సాకుతో పాకిస్థాన్ వైమానికి దాడులకు తెగబడింది. రెండు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ రెండు దాడుల్లో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ చర్యను ఆప్ఘనిస్తాన్ ప్రతినిధి ఖండించారు. ఈ చర్య తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌ స్వదేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయలేక మమ్మల్ని నిందించడం తగదని తెలిపింది. అక్కడి ప్రభుత్వంలోనే అసమర్థత నెలకొందని.. ఇలాంటి చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆప్ఘనిస్తాన్ హెచ్చరించింది. ఈ విషయంలో ఇస్లామిక్‌ ఎమరేట్‌ ఆఫ్‌ అఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం ఏమాత్రం రాజీ పడదని పేర్కొంది. తూర్పు ప్రావిన్స్‌లోని ఖోస్ట్‌, పాక్టికలో సోమవారం పాకిస్థాన్‌ విమానాలు దాడులు నిర్వహించింది. ఇప్పటికే పాక్‌-ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ దాడులు జరగడం మరింత ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం..

పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ప్రాంతంలో రెండ్రోజుల క్రితం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. వీరి అంత్యక్రియల సందర్భంగా పాక్‌ అధ్యక్షుడు జర్దారీ స్పందిస్తూ కచ్చితంగా తమ వీరుల త్యాగాలు వృథాగా పోవని ప్రతిజ్ఞ చేశారు. టీటీపీ ఉగ్రవాదులే ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంస్థను ఆప్ఘనిస్థాన్ భూభాగం కేంద్రంగా నడిపిస్తున్నారు. మొత్తానికి సోమవారం పాక్ ప్రతీకార చర్యలకు పూనుకుంది.

ఇటీవల పాక్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నవాజ్ షరీఫ్-భుట్టో పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. జర్దారీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Show comments