NTV Telugu Site icon

Teamindia: భారత్‌ను పాకిస్థాన్ ఓడించగలదు.. పాక్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

Wasim

Wasim

న్యూజిలాండ్‌పై భారత్ ఓటమి పాలైనప్పటి నుంచి టీమిండియాను అందరూ టార్గెట్ చేస్తున్నారు. సూటి పోటీ మాటలతో తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. తాజాగా.. పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ వసీం అక్రమ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టు కూడా భారత్‌ను ఓడించగలదని అన్నాడు. ఈరోజు పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇంగ్లండ్‌కు చెందిన మైఖేల్ వాన్, పాకిస్తాన్‌కు చెందిన వసీం అక్రమ్‌ కామెంటరీ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ్‌ను వాన్ ఓ ప్రశ్న అడుగుతూ, “నేను భారత్-పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్‌ని చూడాలనుకుంటున్నాను” అని అన్నాడు.

Read Also: SDT 18: ధరమ్ తేజ్ సినిమాలో జగపతిబాబు.. భయపెడుతున్నాడే!

దీంతో అక్రమ్ ప్రశ్నకు సమాధానం చెబుతూ, “ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. క్రికెట్ అంటే రెండు దేశాలకు పిచ్చి” అని అన్నాడు. ఆ తర్వాత.. వాన్ మాట్లాడుతూ, “ఇప్పుడు పాకిస్థాన్ టర్నింగ్ పిచ్‌లపై భారత్‌ను ఓడించగలదు” అని అన్నాడు. దీనికి అక్రమ్ స్పందిస్తూ.. “స్పిన్నింగ్‌ ట్రాక్‌పై టెస్టు క్రికెట్‌లో భారత్‌ను ఓడించే అవకాశం ఇప్పుడు పాకిస్తాన్‌కు ఉంది”. అని తెలిపాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు గురించి వసీం అక్రమ్ గొప్పగా చెప్పాడు. ఇటీవలే టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టును పాకిస్తాన్ ఓడించిన సంగతి తెలిసిందే..

Read Also: Gujarat: గుజరాత్‌లో ఘోర విషాదం.. కారులో ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి

గత 24 ఏళ్లలో తొలిసారిగా స్వదేశంలో భారత జట్టు క్లీన్‌స్వీప్‌ను ఎదుర్కొంది. స్పిన్నర్లకు భారత బ్యాట్స్‌మెన్లు తట్టుకోకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణం. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు సత్తా చాటలేకపోయారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ భారత టాప్ బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టారు. మరోవైపు.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చాలా కాలం తర్వాత స్వదేశంలో పాక్ స్పిన్నర్లు అదరగొట్టారు. దీంతో.. పాక్ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే.. స్పిన్నింగ్ వికెట్లపై టీమిండియాను తమ జట్టు ఓడించగలదని వసీం అక్రమ్ అన్నట్లు తెలుస్తోంది.

Show comments