NTV Telugu Site icon

Pakistan: ఇమ్రాన్‌ అరెస్ట్‌తో భగ్గుమన్న పాకిస్థాన్.. అల్లర్ల అణచివేతకు రంగంలోకి సైన్యం

Pak Army

Pak Army

Pakistan: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. పాక్‌లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన అల్లర్లు, ఆందోళనలు బుధవారమూ కొనసాగాయి. పలుచోట్ల విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ఏడుగురు మృతి చెందగా 300 మందికి గాయాలయ్యాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌పై అల్లర్లను అణిచివేసేందుకు పాకిస్థాన్ సైన్యాన్ని పిలిపించింది. పార్టీ ఆందోళనలతో అట్టుడికిన పంజాబ్, ఖైబర్‌ తదితర ప్రావిన్సుల్లో అల్లర్లను అదుపు చేసేందుకు సైన్యాన్ని మోహరించారు. శాంతిని పునరుద్ధరించేందుకు రెండు ప్రావిన్సులు, రాజధానిలో సైన్యాన్ని మోహరించడానికి మంత్రివర్గం ఆమోదించింది. ఇమ్రాన్‌ఖాన్‌ను మంగళవారం రాజధాని ఇస్లామాబాద్‌లో సాధారణ విచారణ సందర్భంగా అరెస్టు చేశారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవినీతి నిరోధక కోర్టులో ఆయనను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

అవినీతి నిరోధక కోర్టులో విచారణ తర్వాత ఇమ్రాన్‌ను సెషన్స్‌ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తోషఖానా అవినీతి కేసులో ఆయనపై నేరాభియోగాలను న్యాయమూర్తి నమోదు చేశారు. ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఖరీదైన బహుమతులను అందించేందుకు 1974లో ఏర్పాటు చేసిన సంస్థే తోషఖానా. దీనికి స్టోర్‌ ఉంది. ప్రధానిగా ఉన్నప్పుడు అక్కడ రాయితీతో వస్తువులను తీసుకున్న ఇమ్రాన్‌.. ఆ తర్వాత వాటిని అధిక ధరకు అమ్ముకున్నారనేది ఈ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌పై వచ్చిన ఆరోపణ. ఇస్లామాబాద్‌లో అత్యంత భద్రత కలిగిన పోలీస్‌ లైన్స్‌లోని నూతన పోలీస్‌ అతిథి గృహాన్ని ఈ కేసుల విచారణకు తాత్కాలిక కోర్టుగా నిర్ణయించారు. ఈ ప్రాంతానికి మీడియానూ అనుమతించలేదు. కోర్టు పరిసరాలకు వచ్చిన పార్టీ కీలక నేతలు ఖురేషీ, ఉమర్‌లనూ అడ్డుకున్నారు. పైగా రెండు అవినీతి కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉమర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఖురేషీ కోర్టు ఆవరణలోకి వెళ్లి అరెస్టు నుంచి తప్పించుకున్నారు.

Read Also: Maharashtra Political Crisis: మహా ప్రభుత్వం ఉంటుందా.. ఊడుతుందా..? నేడు సుప్రీం కీలక తీర్పు..

ఇంటర్నెట్ కట్, పరీక్షలు రద్దు
ఆందోళనల నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తగ్గించాలని, సోషల్ మీడియా సైట్‌లు ట్విట్టర్, ఫేస్‌బుక్ మరియు యూట్యూబ్‌లకు యాక్సెస్ పరిమితం చేయాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు ఆ దేశ కమ్యూనికేషన్ ఏజెన్సీ తెలిపింది.దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థులకు సంవత్సరాంతపు పరీక్షలు రద్దు చేయబడ్డాయి.పాకిస్తాన్ అంతటా వందలాది మంది పోలీసు అధికారులు గాయపడ్డారు, పంజాబ్ ప్రావిన్స్‌లో దాదాపు 1,000 మందిని అరెస్టు చేశారు. కొంతమంది నిరసనకారులు సైన్యంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లాహోర్‌లోని కార్ప్స్ కమాండర్ నివాసాన్ని తగలబెట్టారు. రావల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌పై రాళ్లతో దాడి చేశారు. బుధవారం, మిలిటరీ మీడియా విభాగం సైనిక , ప్రభుత్వ సౌకర్యాలపై దాడి చేసే వారిపై “తీవ్రమైన ప్రతిచర్య” గురించి హెచ్చరించింది. ఖాన్ అరెస్టు చుట్టూ “రాజకీయ ప్రతీకారం” లేదని న్యాయ మంత్రి అజం నజీర్ తరార్ విలేకరులతో అన్నారు. ఇమ్రాన్‌ నిర్బంధానికి దారితీసిన కేసును నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో, పాకిస్తాన్ అగ్ర అవినీతి నిరోధక శాఖ తీసుకుంది.

అయితే ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించుకునేలా పునరుద్దరించాలని ‘‘పాకిస్తాన్ టెలీకమ్యూనికేషన్ అథారిటీ’’కి అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విజ్ఞప్తి చేసింది. శాంతియుతంగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలు హింసాత్మక రూపు దాల్చేలా కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పై తమ తదుపరి కార్యాచరణ కోసం పార్టీ ఉపాధ్యక్షుడు షా మొహమ్మద్ ఖురేషి నేతృత్వంలోని ఆరుగురు సీనియర్ నేతలతో కమిటీ ఏర్పాటైంది. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, ఫైసలాబాద్, గుజ్రాన్ వాలా, ముల్తాన్, పెషావర్, మర్దాన్ నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. రాజధాని ఇస్లామాబాద్ లో పెద్ద ఎత్తున పీటీఐ కార్యకర్తలు ఆం

Show comments