Pakistan: వికీపీడియా వెబ్‌సైట్‌ను పాకిస్థాన్ బ్లాక్ చేసింది. అభ్యంతరకరమైన లేదా దైవదూషణ విషయాలను తొలగించడానికి వెబ్‌సైట్ నిరాకరించడంతో పాకిస్తాన్ వికీపీడియాను బ్లాక్ చేసింది. పాకిస్తాన్ టెలికాం అథారిటీ వికీపీడియా సేవలను 48 గంటలపాటు వికీపీడియా సేవలను ఆపేసింది. దైవాన్ని దూషిస్తున్నట్లుగా ఉన్న కంటెంట్‌ను తొలగించకుంటే వికీపీడియాను శాశ్వతంగా బ్లాక్‌లిస్టులో పెడుతామని పాక్ తెలిపింది. వికీపీడియాను బ్లాక్ చేసింది నిజమే అని పాకిస్థాన్ టెలికాం అథారిటీ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.
హైకోర్టు సూచన మేరకు, ఎన్‌సైక్లోపీడియా వెబ్‌సైట్‌లో దైవదూషణకు సంబంధించిన కంటెంట్ ఉన్నందున 48 గంటల పాటు పీటీఏ వికీపీడియా సర్వీసులను నిలిపివేసింది. వికీపీడియా వెబ్‌సైట్‌లో ఉచితంగా ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. వికీమీడియా ఫౌండేషన్ దీన్ని హోస్ట్ చేస్తోంది. దైవదూషణ ఉన్న కంటెంట్‌ను తొలగించాలని వికీపీడియాకు నోటీసులు ఇచ్చినట్లు పాకిస్థాన్ టెలికాం అథారిటీ ప్రతినిధి చెప్పారు.
Verity Theft: దొంగతనానికి సొరంగం తవ్వారు.. సారి చెప్పి జారుకున్నారు
నివేదించబడిన చట్టవిరుద్ధమైన కంటెంట్ బ్లాక్ చేయబడితే/తొలగించబడినట్లయితే వికీపీడియా సేవల పునరుద్ధరణ పునఃపరిశీలించబడుతుందని ప్రతినిధి తెలిపారు. సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు దైవదూషణగా భావించిన కంటెంట్‌పై గతంలో బ్లాక్ చేయబడ్డాయి. ముస్లింలు మెజారిటీగా ఉన్న పాకిస్థాన్‌లో దైవదూషణ అనేది ఒక సున్నితమైన అంశం.
