Target Ambani: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్థానీయులతో జరిగిన బ్లాక్-టై కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యక్ష అణు బెదిరింపునకు పాల్పడ్డారు. భవిష్యత్తులో భారతదేశంతో యుద్ధం జరిగితే తమ దేశం “సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది” అని పేర్కొన్నారు. అనంతరం ఆయన భారత బిలియనీర్ ముఖేష్ అంబానీని ప్రత్యేకంగా ప్రస్తావించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తదుపరి తాము ఏమి చేస్తామో చూపించడానికి, ముఖేష్ అంబానీ చిత్రంతో పాటు ఖురాన్‌లోని 105వ అధ్యాయం అయిన ‘సూరా అల్-ఫిల్’ గురించి ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ చేసినట్లు మునీర్ సమావేశంలో పేర్కొన్నట్లు వెల్లడించాయి. పలు నివేదిక ప్రకారం.. అమెరికా గడ్డ నుంచి మూడవ దేశానికి వ్యతిరేకంగా అణు బెదిరింపులు జారీ కావడం ఇదే మొదటిసారి.
READ MORE: Sai Durga Tej : నాకు ఆమెనే గుర్తొస్తోంది.. సాయిదుర్గాతేజ్ ఫన్నీ కామెంట్స్
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్… భారత్‌పై నిత్యం విషం కక్కుతూ ఉంటాడు. విదేశాల్లో స్థిరపడిన పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు జూన్లో మునీర్ అమెరికాలో పర్యటించాడు. ఆయనకు వైట్ హౌస్లో ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. ఇక రెండు నెలల వ్యవధిలో మరోసారి అసిమ్ మునీర్ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడు.
READ MORE: Income Tax Bill: లోక్ సభలో కొత్త ఆదాయపన్ను బిల్లు పాస్..
