Site icon NTV Telugu

Pakistan: నేడు రాజకీయ నాయకుల జీవితకాల అనర్హత నిషేదంపై పాక్ సుప్రీం కోర్టులో విచారణ

Pakisthan

Pakisthan

రాజకీయ నాయకుల జీవితకాల అనర్హత నిషేదం కేసును ఇవాళ విచారిస్తామని పాకిస్థాన్ సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్), ఎన్నికల చట్టం 2017కి సవరణ ప్రకారం అనర్హత కాలానికి సంబంధించిన అన్ని వివాదాలను చీఫ్ జస్టిస్ ఖాజీ ఇసా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేయనుంది. ఈ విచారణ ఫలితం నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది.

Read Also: Pushpa 2: బాలీవుడ్ లో సలార్ విషయంలో జరిగిన రచ్చనే పుష్ప 2కి జరగబోతుందా?

కాగా, ఈ చట్టం ప్రకారం దేశంలోని అగ్రనేతలిద్దరూ అనర్హులయ్యారు. ఆర్టికల్ 62(1)(ఎఫ్) ప్రకారం అనర్హత జీవితాంతం ఉంటుంది.. అయితే పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దానిని రద్దు చేసిందని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2018 తీర్పులో పేర్కొంది. ఎన్నికల చట్టం-2017లో చేసిన మార్పుల ప్రకారం అనర్హత వేటు పడిన రాజకీయ నాయకుడికి కేవలం ఐదేళ్ల శిక్షను ఖరారు చేసింది. ఇప్పుడు అనర్హత కాలానికి సంబంధించిన వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించనుంది.
పనామా పేపర్స్ లీక్ కేసులో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై 2017లో అనర్హత వేటు పడింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇదే చట్టం ప్రకారం గతేడాది తోషాఖానా కేసులో అతని ప్రత్యర్థి ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు పడింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ అనర్హతపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో అతని అనర్హతపై అప్పీల్ ఇంకా పెండింగ్‌లో ఉంది.

Exit mobile version