NTV Telugu Site icon

PAK vs USA: అరగంట చాలు మాకు.. అన్నంత పని చేసిన అమెరికా కెప్టెన్!

Us Captain Monank Patel

Us Captain Monank Patel

United States Captain Monank Patel about Pakistan Match: అమెరికా కెప్టెన్ మోనాన్క్ పటేల్ అన్నంత పని చేశాడు. పాకిస్థాన్‌ను ఓడించడానికి తమకు ఓ అరగంట చాలని మ్యాచ్‌కు ముందు అన్న మోనాన్క్.. చేసి చూపించాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా గ్రూప్‌-ఏలో డల్లాస్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లో యూఎస్ గెలుపొందింది. పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 రన్స్ చేయగా.. ఛేదనలో యూఎస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. సూపర్‌ ఓవర్‌లో అమెరికా ఒక వికెట్ కోల్పోయి 18 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్‌ 13 రన్స్ చేసి ఓడింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూఎస్.. మొదటి అరగంటలో మ్యాచ్‌పై పట్టు సాధించింది. డేంజరస్ ఓపెనర్‌ మహ్మద్ రిజ్వాన్ (9) సహా హిట్టర్లు ఉస్మాన్ ఖాన్ (3), ఫఖర్ జమాన్ (11)లను త్వరగానే యూఎస్ బౌలర్లు పెవిలియన్ చేర్చారు. దాంతో పాక్ భారీ స్కోర్ చేయలేకపోయింది. అనంతరం ఛేదనలో అమెరికా ఓపెనర్‌ స్టీవెన్ టేలర్‌ (12) నిరాశపరిచినా.. కెప్టెన్ మోనాంక్ పటేల్ (50), ఆండ్రీస్ గౌస్ (35) క్రీజులో నిలబడి మంచి భాగస్వామ్యం అందించారు. ఆపై ఆరోన్ జోన్స్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. మ్యాచ్‌లో 30-40 నిమిషాలు తాము మంచి ప్రదర్శన చేస్తే పాకిస్థాన్‌ను ఓడించొచ్చన్న అమెరికా కెప్టెన్ మోనాన్క్ పటేల్ అన్న మాటలే నిజమయ్యాయి.

Also Read: Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్‌ ఛెత్రి వీడ్కోలు!

‘పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో 30-40 నిమిషాలు మేం మంచి ప్రదర్శన చేస్తే చాలు. మ్యాచ్‌లో గెలుస్తాం’ అని మోనాన్క్ పటేల్ అన్నాడు. అనడమే కాదు అదే చేసి చూపించాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 గ్రూప్‌-ఏలో భాగంగా ఆడిన రెండు మ్యాచ్‌లలో అమెరికా గెలిచింది. మొదటి మ్యాచ్‌లో కెనడా 194 రన్స్ చేయగా.. యూఎస్ 17.4 ఓవర్లలోనే 197 రన్స్ చేసి గెలిచింది. ఇక పాకిస్థాన్‌పై చరిత్రాక విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గ్రూప్‌-ఏలో భారత్, ఐర్లాండ్ జట్లతో యూఎస్ ఆడాల్సి ఉంది. ఇందులో ఒక్క మ్యాచ్ గెలిచినా.. అమెరికా సూపర్ 8 చేరుతుంది.