NTV Telugu Site icon

Pak vs NZ: ఫార్మెట్ మారినా తీరుమారని పాకిస్తాన్.. తొలి వన్డేలో ఘోర ఓటమి

Pak Vs Nz

Pak Vs Nz

Pak vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఓడిన తర్వాత కూడా పాకిస్తాన్ తీరు మాత్రం ఏమాత్రం మారలేదు. నేటి నుండి మొదలైన వన్డే సిరీస్ పైనే ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ కు మరోమారు నిరాశే మిగిలింది. మైదానం మారింది, పాకిస్తాన్ జట్టులో మార్పులు వచ్చినా వారి ఓటముల పరంపర మాత్రం ఆగలేదు. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 73 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌ లు జట్టులోకి వచ్చినా పాకిస్తాన్‌కు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు.

Read Also: April 1: ఏప్రిల్ 1 నుంచి మారబోతున్నవి ఇవే.. టాక్స్ రేట్స్, యూపీఐ, జీఎస్‌టీ..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ న్యూజిలాండ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. న్యూజిలాండ్ మొదట్లో కేవలం 50 పరుగులకు 3 వికెట్లు కోల్పోగా ఆ నిర్ణయం సరైనదే అనిపించింది. కానీ చాప్మన్, డారిల్ మిచెల్ ల భాగస్వామ్యం మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసింది. వీరిద్దరి మధ్య 199 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొంది. మిచెల్‌తో తన భాగస్వామ్యంలో చాప్‌మన్ తన మూడవ ODI సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. అతను 94 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 111 బంతులు ఎదురుకున్న అతడు 132 పరుగులు చేశాడు.

Read Also: Gun Fire : గుడిమల్కాపూర్‌లో గాలిలో కాల్పుల కలకలం

ఇలా మొత్తానికి పాకిస్తాన్ విజయానికి న్యూజిలాండ్ 50 ఓవర్లలో 345 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, పాకిస్తాన్ జట్టు 44.1 ఓవర్లలో 271 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్తాన్ తరఫున బాబర్ అజామ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను 83 బంతులను ఎదుర్కొని 78 పరుగులు చేశాడు. బాబర్ కాకుండా.. సల్మాన్ అగా కూడా 58 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 34 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్ తరఫున బౌలర్ నాథన్ స్మిత్ ఏకంగా నలుగురు పాకిస్తానీ బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసి వారి ఓటమికి కారణమయ్యాడు

పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్‌ను గెలుచుకోవడం ద్వారా 1-0 ఆధిక్యంలో ఉంది. ఏప్రిల్ 2న జరగనున్న రెండో వన్డే ఇప్పుడు పాకిస్తాన్‌కు మరింత కీలకంగా మారనుంది.