ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో పేలవ ప్రదర్శన చేసిన బాబర్ అజామ్, షహీన్ అఫ్రీది, నసీం షా, సర్ఫరాజ్ అహ్మద్‌లపై వేటు పడింది. ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు టెస్ట్‌ల కోసం పీసీబీ ప్రకటించిన జట్టులో వీరికి చోటు దక్కలేదు. పీసీబీ నిర్ణయంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ తాజాగా స్పందించాడు.
బాసిత్ అలీ మాట్లాడుతూ… ‘ముల్తాన్ పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేశారు. బాబర్ అజామ్ ఫామ్‌లో లేడు కాబట్టి ఆ పిచ్‌లో కూడా ఔట్ అయ్యాడు. అది అతడి దురదృష్టం అనే చెప్పాలి. అయితే ప్రతిసారి మేనేజ్‌మెంట్ టార్గెట్ చేసేది మాత్రం షహీన్ అఫ్రిదినే. షహీన్‌కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఎవరు స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించాలి. నవ్వుతూ మాట్లాడే వాళ్లందరూ మనవాళ్లు కాదు’ అని పేర్కొన్నాడు.
Also Read: Virat Kohli: కోహ్లీకి మద్దతుగా నిలిచిన గౌతమ్ గంభీర్!
‘బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలు జట్టులోనే ఉండాలి. బాబర్ అభిమానులు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఫాన్స్ ఇప్పుడు బయటికి వచ్చి వారికి మద్దతుగా నిలవండి. పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్ తప్పు చేసింది. అందరూ దాని గురించి ప్రశ్నించండి. దేశవాళీ మ్యాచ్‌లు లేనప్పుడు వారికి విశ్రాంతి ఇవ్వడంలో అర్థం లేదు’ అని బాసిత్ అలీ చెప్పుకొచ్చాడు. ముల్తాన్ వేదికగానే అక్టోబర్ 15 నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది.