Site icon NTV Telugu

Pakistan Boat: భారీగా ఆయుధాలతో పాక్ ఫిషింగ్ బోటు.. అడ్డుకున్న అధికారులు

Pak Boat

Pak Boat

Pakistan Boat: పాక్ ఫిషింగ్ బోటులో భారీగా ఆయుధాలను గుర్తించి భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది పట్టుకున్నారు. ఆయుధాలు, 10 మంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్థాన్ ఫిషింగ్ బోటును భారత జలాల్లో కోస్ట్ గార్డ్ అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆయుధాలు, పదిమంది సిబ్బందితో వెళ్తున్న పాకిస్తాన్‌ ఫిషింగ్ బోట్‌ అల్‌ సోహెలీని అడ్డుకున్నట్లు భారత్‌ కోస్ట్‌ గార్డ్‌ పేర్కొంది. అంతేగాదు ఆ పాకిస్తానీ బోట్‌ను అడ్డగించే ఆపరేషన్‌ను గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ లేదా ఏటీఎస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించినట్లు భారత్‌ కోస్ట్‌ గార్డ్‌ ట్విట్టర్‌లో తెలిపింది. ఆ బోటులో సుమారు 300 కోట్ల ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు దాదాపు 40 కిలోల మాదకద్రవ్యాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ కోసం బోటును ఓఖాకు తీసుకువస్తున్నట్లు కోస్ట్‌గార్డు పేర్కొంది.

Read Also: Gold Seized : కి‘లేడీ’ బంగారం అక్కడ పెట్టింది.. చెకింగ్ ను తప్పించుకుంది.. కానీ

పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ భారతదేశంలో ప్రధాన సమస్యగా మారింది. వీటిని అరికట్టేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్ (హెచ్ హెచ్ టీఐ), నైట్ విజన్ డివైస్ (ఎన్ వీడీ), ట్విన్ టెలిస్కోప్, అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ) వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫోర్స్ మల్టిప్లైయర్‌ల మార్గాలుగా ఉపయోగిస్తున్నారని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) తెలియజేసింది. అంతేకాకుండా సీపీటీవీ, పీటీజెడ్ కెమెరాలు, ఐఆర్ సెన్సార్లతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఇన్‌ఫ్రారెడ్ అలారంలతో కూడిన ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ టెక్నాలజీని అంతర్జాతీయ సరిహద్దులోని ఎంపిక చేసిన ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. పర్యవేక్షణను మెరుగుపరిచేందుకు రానున్న రోజుల్లో 5,500 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా చేయనున్నట్లు చెప్పారు.

Exit mobile version