NTV Telugu Site icon

Pakistan: ఎయిర్‌పోర్టులో యురేనియం.. దీనిపై పాకిస్తాన్ ఏమందంటే?

Pakistan

Pakistan

Pakistan: గత నెలలో లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఏకంగా యురేనియం పట్టుబడిన సంగతి తెలిసిందే. యురేనియంతో కూడిన ప్యాకేజీ దొరకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిపై బ్రిటిష్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 29న తనిఖీల్లో భాగంగా దీన్ని కనుక్కున్నారు. అయితే ఈ ప్యాకేజీ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒమన్ నుంచి వచ్చే విమానంలో ఈ ప్యాకేజీ లభించింది. అయితే తాజాగా పాకిస్తాన్ ఈ యురేనియం ప్యాకేజీ గురించి స్పందించింది. బ్రిటీష్ మీడియాలో వచ్చిన వార్తలను పాకిస్తాన్ ఇవాళ ఖండించింది. ఈ వార్త వాస్తవం కాదని కొట్టిపారేసింది. యూకే అధికారికంగా పాకిస్తాన్‌తో ఎటువంటి సమాచారం పంచుకోలేదని పాక్‌ ఉన్నతాధికారి పేర్కొన్నారు. నివేదికలు వాస్తవం కాదని తాము విశ్వసిస్తున్నట్లు విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా తెలిపారు.

Delhi: ఆప్‌కు భారీ షాక్.. 10 రోజుల్లో రూ.163.62 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే..

డిసెంబర్ 29న సాయంత్రం వచ్చిన ఒమన్ ఎయిర్ ప్యాసింజర్ ఫ్లైట్ డబ్ల్యూవై 101 ద్వారా కార్గో ప్యాకేజీ హీత్రో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 4కి చేరిన సంగతి తెలిసిందే. స్క్రాప్ మెటల్ షిప్‌మెంట్‌లో యురేనియం దొరికింది. అణుపదార్థంగా యురేనియాన్ని వాడుతారు. అణ్వాస్త్రాలు, అణు విద్యుత్ ఫ్లాంట్లలో దీన్ని ఇంధనంగా ఉపయోగిస్తారు. పాకిస్తాన్ నిఘా లేకపోవడం వల్లే ఇది వచ్చిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే పట్టుబడిన యురేనియం చిన్న మొత్తంలోనే ఉందని.. ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని నిపుణులు అంచనా వేసినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు యూకే పోలీసులు తెలిపారు.

Show comments