Pakistan PM: ‘ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్థాన్’ అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ మాటలకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దశాబ్దాలుగా అణ్వాయుధాల విషయంలో పాక్ అత్యంత బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరిస్తూ వస్తుందన్నారు. అణు ఆస్తుల విషయంతో అత్యంత భద్రతా ప్రమాణాలను పాకిస్తాన్ పాటిస్తుందని స్పష్టం చేశారు.
పాక్ ను బైడెన్ అత్యంత ప్రమాదకర దేశంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. వీటిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ వ్యాఖ్యలు నిజాలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ‘గత దశాబ్దాలుగా పాకిస్థాన్ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా నిరూపించబడింది. మా అణు కార్యక్రమం సాంకేతికంగా, ఫూల్‌ప్రూఫ్ కమాండ్, కంట్రోల్ సిస్టమ్ ద్వారా నిర్వహించబడుతుంది’ అని పాక్ ప్రధాని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: MBBS in Hindi: హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించిన అమిత్ షా.
‘పాకిస్థాన్, అమెరికా ఎంతో కాలంగా స్నేహపూర్వక, పరస్పర ప్రయోజనకరమైన సంబంధాల కలిగి ఉన్నాయి. ప్రపంచం భారీ సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో పాక్ నిజమైన సామర్థ్యాన్ని గుర్తించడానికి, మన్నికైన ప్రయత్నాలు చేయాలి. అంతే తప్ప పాక్–అమెరికా సంబంధంపై అనవసరమైన వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. శాంతి, భద్రతను పెంపొందించడానికి యుఎస్‌తో సహకరించాలనేది మా కోరిక’ అని షరీఫ్ అన్నారు.
Read Also: Nirmala Sitaraman: రూపాయి విలువ పడిపోవడానికి కారణం చెప్పిన నిర్మలమ్మ
పాక్ అణ్వాయుధాలను కలిగి ఉందని కాలిఫోర్నియాలో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్‌లో అమెరికా అధ్యక్షుడు విమర్శించారు. చైనా, రష్యాకు సంబంధించి అమెరికా విదేశాంగ విధానం గురించి బిడెన్ మాట్లాడుతుండగా పాకిస్థాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా తాను భావిస్తున్నట్లు బిడెన్ చెప్పారు. దీనిపై ఇది వరకే ట్విట్టర్ లో స్పందించిన షరీఫ్.. ‘పాక్ బాధ్యతాయుతమైన అణు దేశం. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అవసరాలకు అనుగుణంగా మా అణు ఆస్తులకు అత్యుత్తమ రక్షణలు ఉన్నందుకు మేం గర్విస్తున్నాము. మేము ఈ భద్రతా చర్యలను తీసుకుంటాము. దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు వద్దు’అని ట్వీట్ చేశారు.
