Site icon NTV Telugu

Pahalgam Terrorist Attack: రాత్రి వైజాగ్‌కు సీఎం చంద్రబాబు.. చంద్రమౌళి మృతదేహానికి నివాళులు!

Chandramouli, Cm Chandrababu

Chandramouli, Cm Chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి 10 గంటలకు వైజాగ్‌కు వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి చంద్రమౌళి మృతదేహానికి సీఎం నివాళులర్పించనున్నారు. ఆపై చంద్రమౌళి కుటుంబసభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంటాడి మరీ చంపిపారు. చంపొద్దని వేడుకున్నా.. ఉగ్రమూకలు వినకుండా చంద్రమౌళిని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం తెలిసిన వెంటనే వైజాగ్‌ నుంచి కుటుంబసభ్యులు పహల్గాంకు బయల్దేరి వెళ్లారు. చంద్రమౌళి మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు చేరుకోనుంది.

Also Read: Gorantla Madhav: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు గోరంట్ల తరలింపు!

చంద్రమౌళి తోడల్లుడు కుమార్ రాజా ఎన్టీవీతో మాట్లాడుతూ… ‘ఈనెల 18న ట్రావెల్ ఎజెంట్స్ ధ్వారా కశ్మీర్ టూర్‌కి చంద్రమౌళి వెళ్లారు. విశాఖ నుండి మొత్తం ఆరుగురు వెళ్లారు. ఈనెల 25 నాటికి తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు స్నేహితులు అప్పన్న, శశిధర్ ఫామిలీలు వెళ్లాయి. చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ.. ముష్కరులు హతమార్చారు. మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు తరలిస్తారు. చంద్రమౌళి ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి రేపు విశాఖ వస్తారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి’ అని చెప్పారు.

Exit mobile version