NTV Telugu Site icon

Padmapriya : అందరి ముందే సినిమా సెట్‌లో ఆ డైరెక్టర్ కొట్టాడు : హీరోయిన్ పద్మప్రియ

New Project (48)

New Project (48)

Padmapriya : ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన హేమ కమిటీ రిపోర్ట్ సంచలనాలు సృష్టిస్తుంది. ఈ నివేదిక తర్వాత చాలా మంది ఉలిక్కి పడ్డారు. ఇండస్ట్రీలో ఆడవారు లైంగికంగా వేధింపులు ఎదుర్కొంటున్నారని.. అవకాశాల కావాలంటే దర్శకనిర్మాతలు చెప్పినట్లు వారి పక్కలోకి వెళ్లాలని లేకపోతే ఇండస్ట్రీలో ఛాన్స్ లు రాకుండా చేస్తారని మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి నటీమణులు కొందరు తమకు సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను బయటకి చెప్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ తనకు జరిగిన సంఘటన గురించి మరోసారి చెప్పుకొచ్చింది.

Read Also:Israel-Iran War: ఒకప్పుడు స్నేహం చేసిన ఇజ్రాయెల్-ఇరాన్ బద్ధ శత్రువులుగా ఎలా మారాయి?

తమిళ కుటుంబానికి చెందిన పద్మప్రియ తెలుగు సినీ పరిశ్రమలో శ్రీను వాసంతి లక్ష్మి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళ్, మలయాళీ, హిందీ సినిమాలు చేసింది. ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది పద్మప్రియ. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పద్మప్రియ 2007లో తనకు జరిగిన సంఘటన గురించి మరోసారి మాట్లాడింది. 2007లో పద్మప్రియ ఓ తమిళ్ సినిమా చేస్తుండగా ఆ సినిమా డైరెక్టర్ సామి సినిమా సెట్లో అందరి ముందు పద్మప్రియను కొట్టాడు. అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది. ఆ తర్వాత ఆ డైరెక్టర్ పై ఒక ఏడాది పాటు బ్యాన్ విధించారు.

Read Also:Polena Anjana: పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమార్తెను చూశారా?.. అక్కాచెల్లెళ్ల పిక్స్ వైరల్?

తాజాగా ఆ సంఘటనని గుర్తుచేసుకుంటూ పద్మప్రియ మాట్లాడుతూ.. నన్ను ఆ డైరెక్టర్ కొడితే కొంతమంది నేనే ఆ డైరెక్టర్ ని కొట్టానని నా పైనే ఆరోపణలు సృష్టించారు. మొదట్లో నా వాదనని ఎవరూ పట్టించుకోలేదు. మహిళల అనుభవాలను కొట్టి పారేస్తారు లేదా వాళ్లదే తప్పు అన్నట్లు చిత్రీకరిస్తారు. నాకు ఎదురైన అనుభవమే అందుకు ఉదాహరణ. ఆ ఘటన తర్వాత ఆ డైరెక్టర్ ని తమిళ పరిశ్రమ బ్యాన్ చేసింది. కానీ నేనే ఆ తర్వాత తమిళ సినిమాలు తగ్గించేశానని తెలిపింది. తెలుగులో శీను వాసంతి లక్ష్మి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పద్మప్రియ ఆ తర్వాత తెలుగులో అందరి బంధువయ, పటేల్‌ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తుంది. పద్మప్రియ భరతనాట్యం కళాకారిణి. ప్రస్తుతం మలయాళ పరిశ్రమలో వుమెన్ సేఫ్టీ గురించి పనిచేస్తుంది.

Show comments