Site icon NTV Telugu

Baba Shivanand Saraswati: యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద సరస్వతి ఇకలేరు.!

Baba Shivanand Saraswati

Baba Shivanand Saraswati

Baba Shivanand Saraswati: ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద సరస్వతి (128) ఆదివారం వారణాసిలో కన్నుమూశారు. ఈయమ మూర్తికి సంతాపంగా అనేకమంది సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేస్తూ.. స్వామి శివానంద జీవితం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని అభివర్ణించారు. తన అధికారిక ‘X’ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన పోస్ట్‌లో ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేస్తూ.. యోగా సాధకుడు, కాశీ నివాసి అయిన శివానంద్ బాబాజీ మరణం గురించి వినడం చాలా బాధాకరం. యోగా, దాని సాధనకు అంకితమైన ఆయన జీవితం దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. యోగా ద్వారా సమాజానికి సేవ చేసినందుకు ఆయనకు పద్మశ్రీ కూడా లభించింది. శివానంద్ బాబా శివలోకానికి నిష్క్రమణ కాశీ నివాసితులందరికీ, ఆయన నుండి ప్రేరణ పొందిన లక్షలాది మందికి తీరని నష్టం. ఈ దుఃఖ సమయంలో ఆయనకు నా నివాళి అర్పిస్తున్నాని రాసుకొచ్చారు.

Read Also: Aggregator Cab Policy: ఇక ఓలా, ఉబర్ డ్రైవర్లకు దబిడి దిబిడే.. రైడ్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్లకు డబ్బులే డబ్బులు!

ఇకపోతే, బాబా శివానంద్ 1896 ఆగస్టు 8న ప్రస్తుత బంగ్లాదేశ్‌ లోని సిల్హెట్ జిల్లాలో జన్మించారు. ఇక ఆయన బాల్యం కాస్త కష్టంగానే గడిచింది. ఆ కష్టాల తర్వాత ఆయన కఠిన జీవితాన్ని, క్రమశిక్షణను పాటిస్తూ.. రోజూ సగం కడుపు మాత్రమే ఆహారం తీసుకుంటూ జీవితం గడిపారు. ఇక తన తల్లిదండ్రుల మరణం తరువాత ఆయనను ఓంకార్నంద్, బాబా శివానంద్ ను తన ఆశ్రమంలో చేర్చుకున్నారు. దానితో ఆయన గురువు అయ్యాడు. ఇక అప్పటి నుంచి గురువు ఓంకార్నంద్ మార్గదర్శకత్వంలో బాబా శివానంద్ అనేక ఆధ్యాత్మిక విద్య, జీవిత బోధనలను పొందారు. ఇక ఆయన ఆధ్యాత్మికతకు చేసిన విశేష కృషికి 2022లో భారత ప్రభుత్వం బాబా శివానంద్ కు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్వామి శివానంద మరణం పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు. యోగాకు ఆయన చేసిన కృషి సాటిలేనిదని అభివర్ణించారు.

Exit mobile version