NTV Telugu Site icon

P.hd. Admissions: వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు అవసరం లేదు.. ఇక నెట్‌ స్కోర్‌ తోనే పిహెచ్‌డి ప్రవేశాలన్న యూజీసీ..!

4

4

భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అలాగే ఉన్నత విద్యా సంస్థలలో పిహెచ్‌డి కోసం ప్రవేశాలకు గాను యుజిసి నెట్ స్కోర్ సరిపోతుందని తాజాగా యుజిసి స్పష్టం చేసింది. ఇక ఈ విషయం సంబంధించి పిహెచ్‌డి ప్రవేశాలను వేరువేరుగా నిర్వహించే ప్రవేశాల పరీక్షల అవసరం లేకుండా రాబోయే విద్య సంవత్సరం నుండి పిహెచ్‌డి ప్రవేశాలకు కేవలం నెట్ స్కోర్ లను ఉపయోగించనున్నట్లు కమిషన్ తెలిపింది. యూజీసీ నెట్ పరీక్షను ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తోంది.

Also Read: Balayya : రికార్డులు కొత్తేమి కాదు.. సృష్టించాలన్న నేనే.. తిరగరాయాలన్న నేనే..!

మొదటిసారి జూన్ నెలలో నిర్వహిస్తుండగా.. మరోసారి డిసెంబర్ నెలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలలో సాధించే స్కోరును అనుసరించి ప్రస్తుతం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ JRF ఇవ్వడానికి అలాగే మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించడానికి ఉపయోగిస్తున్నారు. ఇక తాజాగా యూజీసీ పరీక్షల నిబంధనలను మరోసారి సమీక్షించడానికి కమిషన్ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వీరి సూచనల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి పిహెచ్‌డి ఫెలోషిప్ ప్రోగ్రాంలో ప్రవేశానికి గాను ఆయా సబ్జెక్టులలో నెట్ లో సాధించిన స్కోరును ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Houthi Rebels: హౌతీ రెబల్స్ డ్రోన్‌లను ధ్వంసం చేసినట్లు అమెరికా..

ఇక వచ్చే విద్యా సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు పిహెచ్‌డి కోర్సులలో ప్రవేశాలకు గాను నెట్ (NET ) స్కోరు ఉపయోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇకపోతే కొన్ని విశ్వవిద్యాలయాలు పిహెచ్‌డి కోర్సులలో ప్రవేశాలకు గాను విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ విషయం విద్యార్థులకు అనుకూలంగా రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు అలాగే ఐఐటీల వంటి ఉన్నత విద్యా సంస్థలు నిర్వహించే ప్రత్యేక పరీక్షల అవసరాన్ని ఈ నిర్ణయంతో సరళం చేస్తుందని యుజిసి భావిస్తోంది. పిహెచ్‌డి అడ్మిషన్ ప్రక్రియను గాను అభివృద్ధికరించడంలో, అలాగే అభ్యర్థులకు అవకాశాలను పెంచడంలో ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అధికారులు తెలుపుతున్నారు.

Show comments