Site icon NTV Telugu

WhatsApp: 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సాప్

Whatspp

Whatspp

Accounts Banned: మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో 71 లక్షలకు పైగా అకౌంట్స్ ను బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. 2023 నవంబర్ 1 నుంచి -30వ తేదీ మధ్య 71 లక్షల 96 వేల ఖాతాలను బ్యాన్ చేసినట్లుగా తెలిపింది. ఇందులో దాదాపు 19 లక్షల 54 వేల ఖాతాలపై ముందుగానే ఫిర్యాదులు వచ్చినట్లు వాట్సాప్ సంస్థ చెప్పింది. భారత ఐటీ నిబంధనలను అనుసరించి ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. భారతీయ ఖాతాలుగా చెలామణీ అవుతూ.. +91 కోడ్ లేని ఖాతాలపై కూడా వాట్సాప్ నిషేధం విధించినట్లు తెలిపింది.

Read Also: Electoral Bonds: ఇవాళ్టి నుంచి ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ప్రారంభం..

అయితే, భారత్ లో 500 మిలియన్లకు పైగా యూజర్స్ ను వాట్సాప్ కలిగి ఉంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వారి వ్యక్తిగత డేటాకు ఎలాంటి భంగం కలగకుండా ఎండ్ -టు- ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రతను కల్పిస్తుంది. ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు ఉన్న ప్రతి సోషల్ మీడియా సంస్థ నెలవారీ రిపోర్ట్ ను పబ్లిష్ చేయాల్సి ఉంది. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే డిటైల్స్ ను పొందుపరాచాల్సి ఉంది.

Exit mobile version