Farmers Arrested : ఆ పంట వేశారని మణిపూర్‌లో 700 మంది రైతుల అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers Arrested : అక్రమ గసగసాల సాగుపై మణిపూర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. గసగసాల సాగుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న డ్రైవ్‌లో, కొండ గ్రామాలకు చెందిన ఐదుగురు ముఖ్యులతో సహా మొత్తం 703 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. 400 ఎకరాలకు పైగా గసగసాల పొలాలను ధ్వంసం చేసినట్లు ఒక అధికారి తెలిపారు. తూర్పు మణిపూర్‌లోని ఐదు జిల్లాలు మయన్మార్‌తో 400 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. మయన్మార్‌తో దాని అంతర్జాతీయ సరిహద్దులో 10 శాతం కంటే తక్కువ కంచె ఏర్పాటు చేశారు. మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్ సరిహద్దుల ట్రై-జంక్షన్ అయిన గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి భారత్ లోకి అక్రమ డ్రగ్స్ వ్యాపారం యధేచ్చగా కొనసాగుతోంది.
Read Also: Villagers Attack Police : సారా తయారు చేస్తున్నారని తనిఖీకి పోతే.. తరిమి తరిమి కొట్టారు
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
2018లో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం ‘డ్రగ్స్‌పై యుద్ధం’ ప్రకటించింది. దీనికి ‘బంగారు ట్రయాంగిల్’ అడ్డుగా వస్తోంది. అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంతో పాటు, మణిపూర్‌లోని కనీసం ఐదు కొండ జిల్లాలు – ఉఖ్రుల్, సేనాపతి, కాంగ్పోక్పి, కమ్జోంగ్, చురచంద్‌పూర్, తెంగ్నౌపాల్ – గసగసాల సాగు పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ గసగసాల సాగు ప్రజలకు సులభమైన ఆదాయ వనరుగా మారింది. ఎందుకంటే ఇది మార్ఫిన్తో సహా అనేక మందుల ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. మొదటి దశలో సీఎం అయిన తర్వాత బీరెన్ సింగ్ 2017-2022 మధ్య దాదాపు 18,000 ఎకరాల అక్రమ గసగసాలు నాశనం చేయబడ్డాయి. స్వచ్ఛందంగా లొంగిపోయిన గసగసాల రైతులకు పోలీసు కేసుల నుండి మినహాయింపు ఇచ్చారు. అయితే దాని సాగును ప్రోత్సహించే, మద్దతు ఇచ్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం బీరెన్ సింగ్ అన్నారు. మణిపూర్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం దృఢంగా ఉందన్నారు.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..