NTV Telugu Site icon

Sikkim Tourists: సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యటకులు సేఫ్..

Sikkim

Sikkim

సిక్కింలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యాటకులను రక్షించారు. భారీ వర్షాల మధ్య బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వారిని సేఫ్ చేసింది. మంగన్ నుండి లాచుంగ్ మార్గంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. 15,000 మంది పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు, వరదల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా.. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో.. ఉత్తర సిక్కింలో పర్యాటకులు చిక్కుకుపోయారు.

Read Also: Nellore: నెల్లూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఉంది..అటవీ శాఖ అధికారి వెల్లడి

మరోవైపు.. వాతావరణం అనుకూలించిన తర్వాత పర్యాటకులను తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం.. ఒక ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్‌లో సుమారు 50 మంది పర్యాటకులు గ్యాంగ్‌టక్‌కు తాత్కాలిక మార్గాల ద్వారా తరలించారు. అంతేకాకుండా.. మంగళవారం ఉదయం వర్షం పడటంతో.. కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో.. బెంగాల్-సిక్కిం సరిహద్దులోని రిషిఖోలా వద్ద NH 10లో ట్రాఫిక్ నిలిచిపోయింది.

Read Also: RBI Governor post: శక్తికాంత దాస్‌కు మరో ఛాన్స్ దక్కేనా! ఆయన ఏమన్నారంటే..!

ఇదిలా ఉంటే.. ఉత్తర సిక్కింలో జూన్ 12 నుంచి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విపత్తు బారిన పడి ఆరుగురు మృతి చెందారు. మరోవైపు.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీంతో విద్యుత్‌, ఆహార సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. ఇంకా.. అనేక ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్‌లు నిలిచిపోయాయి.