NTV Telugu Site icon

Jammu & Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి ఎన్ని లక్షల మంది ఓటు వేయనున్నారో తెలుసా..?

Jammu

Jammu

Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3. 4 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారని ఎన్నికల కమిషన్ తెలిపింది. అలాగే, మొత్తం 86.9 లక్షల మంది ఓటర్లు అర్హులని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి సగటున 747 మంది ఓటర్లు ఉండేలా 11,629 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందులో 77,290 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉండగా అందులో 2,886 మంది 100 ఏళ్లకు పైబడిన వారున్నారు.

Read Also: Tiger attack: పెద్ద పులి దాడి చేసినా బెదరలేదు, ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడంటే..

ఇక, ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు జమ్మూ కాశ్మీర్‌లో మూడు రోజుల సుదీర్ఘ పర్యటన ముగింపు సందర్భంగా ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. జమ్ము అండ్ కాశ్మీర్ లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ఉత్సాహంగా పాల్గొనాలని ఓటర్లను, రాజకీయ పార్టీలను ఆయన అభ్యర్థించారు. మేము ఎన్నికల సంసిద్ధతను సమీక్షించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నాము.. ఇదే మా చివరి పర్యటన అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.

Read Also: Paytm : పేటీఎం మాస్టర్ ప్లాన్.. తన పార్టనర్ గా రంగంలోకి ఎస్బీఐ

అయితే, శాంతియుతంగా, ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని.. ఓటర్లు గరిష్ఠంగా ఓటింగ్‌ జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 44. 34 లక్షల మంది పురుషులు ఉండగా.. 42. 55 లక్షల మంది మహిళలు సహా మొత్తం 86.9 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలిపింది. వీరిలో 67,400 మంది వికలాంగులు, 158 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు.

Read Also: Jamili Elections: నేడు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి నివేదిక..

కాగా, జమ్ము అండ్ కాశ్మీర్ లో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. 18-19 ఏళ్లలోపు మహిళా ఓటర్లు 1.56 లక్షల మంది ఉండగా, కొత్త మహిళా ఓటర్లు 1.35 లక్షల మంది ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. మొత్తం 11629 పోలింగ్‌ కేంద్రాలకు గాను గ్రామీణ ప్రాంతాల్లో 9307, పట్టణ ప్రాంతాల్లో 2322 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 52 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో (5814) వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం ఉంది.. 267 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా ఉంటాయని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మొత్తం మహిళలే నిర్వహించే పోలింగ్ స్టేషన్లు 93, వికలాంగుల ద్వారా 83 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. అలాగే, అంతర్ రాష్ట్ర- అంతర్జాతీయ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘాలో భాగంగా మొత్తం 47 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు.. 385 అంతర్గత పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.