NTV Telugu Site icon

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ లో ఎన్నికలు.. విధుల్లో ఉన్న 200 మందికి పైగా అధికారులు మిస్సింగ్..

Untitled 12

Untitled 12

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ మంగళవారం ముగిసింది. అయితే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని బీజాపూర్‌లో అత్యల్ప పోలింగ్ అంటే కేవలం 40.98 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల పోలింగ్ ముగిసి కూడా దాదాపు 24 గంటలకు పైగా అవుతుంది. కాగా పోలింగ్‌ బృందం లోని 200 మందికి పైగా పోలింగ్‌ సిబ్బంది ఇప్పటి వరకు ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌కు నివేదికను సమర్పించ లేదని ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌ కి సంబంధించిన అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు మిస్ అయిన సిబ్బంది గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం జరిగిన తొలి విడత పోలింగ్ లో 71.48 శాతం మంది ప్రజలు ఓటు వేశారు. అయితే పోలింగ్ సమయంలో నక్సలైట్లు హింసకు పాల్పడుతూ, ఓటింగ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ముప్పును పసిగట్టిన అధికారులు వేర్వేరు సమయాల్లో ఓటు వేసేందుకు అనుమతించారు. దీనితో కేవలం 40.98 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.

Read also:Kotha Prabhakar Reddy: అంబులెన్స్‌లో వచ్చి నేడు నామినేషన్ వేయనున్న కొత్త ప్రభాకర్ రెడ్డి

అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందిని భద్రతా కారణాల దృష్ట్యా హెలికాప్టర్‌లో పోలింగ్ బూత్‌ల దగ్గర దింపారు. అయితే విధులు నిర్వహిస్తున్న 200 మందికి పైగా సిబ్బంది ప్రస్తుతం కనిపించడం లేదు. వారు ఏం అయ్యారు అనే విషయం పైన ఇప్పటికీ స్పస్టత లేదు. ఈ నేపధ్యం లో బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆంజనేయ వైష్ణవ్ మాట్లాడుతూ.. పోలింగ్ బూత్ సిబ్బందిని నక్సల్స్ కిడ్నప్ చేసి ఉంటారని మేము అనుమానిస్తున్నామని.. మిస్ అయిన సిబంది కోసం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అలానే దాదాపు 76 చోట్ల హెలికాప్టర్ల ద్వారా పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని పంపామని.. కాగా పోలింగ్ ముగిసిన తరువాత సిబ్బంది కనిపించలేదని తెలిపిన ఆయన మిస్ అయిన సిబ్బంది భద్రత బాధ్యత తమదేనని పేర్కున్నారు.

Show comments