Shubman Gill’s Run-Out Video: లండన్‌లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్‌లో భారత్ కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జోష్ టంగ్ వేసిన 35.4 ఓవర్‌కు సాయి సుదర్శన్ (38) ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 38 ఓవర్లలో నాలుగు వికెట్స్ కోల్పోయి 112 రన్స్ చేసింది. కరుణ్ నాయర్ (4), రవీంద్ర జడేజా (1)లు క్రీజులో ఉన్నారు. వరుణుడి అంతరాయాల నడుమ ప్రస్తుతం మొదటి రోజులో మూడో సెషన్ నడుస్తోంది. అయితే ఈ టెస్ట్‌లో టీ విరామం ముందు ఇంగ్లండ్‌కు భారత్ ఫ్రీ గిఫ్ట్ ఇచ్చింది.
వర్షం ఆగిపోవడంతో రెండో సెషన్ మొదలైంది. అప్పటికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మంచి టచ్‌లో ఉన్నాడు. నాలుగు అద్భుత బౌండరీలు బాడి మంచి ఊపులో కనిపించాడు. అట్కిన్సన్ వేసిన 27వ ఓవర్‌లోని రెండో బంతిని ఎదుర్కొన్న గిల్.. డిఫెన్స్ ఆడాడు. బంతి కాస్త ముందుకు వెళ్లడంతో లేని పరుగు కోసం యత్నించాడు. బౌలర్ బంతిని అందుకుని.. స్ట్రైకర్స్ ఎండ్‌లో వికెట్లను గిరాటేశాడు. ఇంకేముంది గిల్ రనౌట్ అయ్యాడు. దాంతో భారత్ 83 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అప్పటికే కష్టాల్లో ఉన్న భారత్‌ను గిల్ రనౌట్ మరింత కష్టాల్లో పడేసింది. దీనిపై భారత్ ఫాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ‘లేని రనౌట్ అవసరమా గిల్’, ‘ఇంగ్లండ్‌కు భారత్ ఫ్రీ గిఫ్ట్’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
INDIA HAS GIFTED A WICKET TO ENGLAND IN TOUGH CONDITIONS 💔 pic.twitter.com/K3TweTiVGs
— Johns. (@CricCrazyJohns) July 31, 2025
