Mahindra BE 6 Batman Edition: 999 మంది ఓనర్ల ఆగ్రహం.. మహీంద్రా సరెండర్.. BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌కు పూర్తి బైబ్యాక్!
- SUV BE 6 Batman Editionతో సృష్టించిన వివాదం
- మొదటి బ్యాచ్ కొనుగోలుదారుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత
- BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌కు పూర్తి బైబ్యాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహీంద్రా & మహీంద్రా తన ఎలక్ట్రిక్ SUV BE 6 Batman Editionతో సృష్టించిన వివాదం ఇప్పుడు పెద్ద స్థాయికి చేరుకుంది. మొదటి బ్యాచ్ కొనుగోలుదారుల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతను గుర్తించి, కంపెనీ వారికి పూర్తి బైబ్యాక్ (డబ్బు వాపసు) ఆఫర్ చేసింది. ఇది భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అరుదైన నిర్ణయం. మొదటి బ్యాచ్ గత సంవత్సరం మహీంద్రా BE 6 Batman Editionను కేవలం 999 యూనిట్లు మాత్రమే అని ప్రకటించి విక్రయించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ 135 సెకన్లలోనే అమ్ముడుపోయింది. కొనుగోలుదారులు ఈ కారును ప్రత్యేకత కోసం ప్రీమియం ధర చెల్లించి కొన్నారు.
Also Read:Rishab Shetty : రిషబ్ శెట్టి..హోంబలే మధ్య విభేదాలు?
Also Read
రెండో బ్యాచ్.. ఈ మార్చి నెలలో మహీంద్రా మళ్లీ 999 యూనిట్ల Batman Editionను విక్రయానికి పెట్టింది. ఇది కేవలం 7 నిమిషాల్లో (కొన్ని నివేదికల ప్రకారం 135 సెకన్లు) సోల్డ్ అవుట్ అయింది. ఇక్కడే అసలు చిక్కులు మొదలయ్యాయి. మొదటి బ్యాచ్ యజమానులు ఇది తమ కారు ప్రత్యేకతను దెబ్బతీస్తుందని, “లిమిటెడ్ ఎడిషన్” అని చెప్పి మోసం చేశారని సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. ఆన్‌లైన్ పిటిషన్ కూడా ప్రారంభమైంది. కస్టమర్ల ఆగ్రహాన్ని గమనించిన మహీంద్రా, మొదటి 999 మంది “ఫౌండింగ్ ఓనర్లు”కు పూర్తి బైబ్యాక్ ఆప్షన్ అందించింది.
దీని అర్థం, ఒకవేళ వినియోగదారుడు తమ కారును తిరిగి ఇవ్వాలనుకుంటే, వారు కంపెనీని సంప్రదించవచ్చు. ఈ ఆఫర్ కోసం వినియోగదారులు తమ సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ మార్చి 18, 2026 నుండి ప్రారంభమై, కేవలం 30 రోజుల పాటు మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది కేవలం మొదటి బ్యాచ్ కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. Mahindra BE 6 ఒక అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ SUV. Batman Edition డార్క్ నైట్ థీమ్‌తో స్పెషల్ డిజైన్, ఫీచర్లు, గ్రాఫిక్స్‌తో వచ్చింది. ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.28.49 లక్షలు.
Also Read:Realme P4 Lite 5G: 7,000mAh బ్యాటరీ, Dimensity 6300తో రియల్‌మీ 5G ఫోన్ విడుదల..
మహీంద్రా ఈ నిర్ణయం కస్టమర్ సంతృప్తి, బ్రాండ్ నమ్మకాన్ని కాపాడటం కోసం తీసుకుందని స్పష్టం చేసింది. “ఫ్యాన్ల నుంచి వచ్చిన భారీ డిమాండ్ వల్ల రెండో బ్యాచ్ విడుదల చేశాము” అని కంపెనీ వివరించింది. చాలా మంది ఓనర్లు ఈ బైబ్యాక్ ఆఫర్‌ను స్వాగతించారు. కానీ కొందరు “ప్రత్యేకతను తిరిగి ఇవ్వలేదు” అని అంటున్నారు. ఆటో ఎంథూజియాస్టులు ఇలాంటి సందర్భాల్లో కంపెనీలు కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌ను వేగంగా స్పందించడం అరుదైన విషయమని చెబుతున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!