శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌పోర్ట్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఔట్ పోస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీ అవినాష్ మహంతి, ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫనికర్, సీఐఎస్ఎఫ్‌డీజి మొహంక్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిధిలోని ప్రయాణికుల కోసం నూతనంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
Read Also: Zelenskyy: ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీకి జేజేలు.. వైట్‌హౌస్‌తో యుద్ధం చేశారంటూ పొగడ్తలు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్.. శంషాబాద్ గ్రామంలో ఉండడంతో ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులు ఫిర్యాదు చేయడానికి ఇబ్బందిగా మారిందని.. జీఎంఆర్ వారి సహకారంతో నూతన ఔట్ పోస్ట్ ప్రారంభించినట్లు సీపీ అవినాష్ మహంతి తెలిపారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కూడా జనాభా పెరిగిందని వారికోసం శంషాబాద్ గ్రామంలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పనిచేస్తుందని.. కేవలం ఎయిర్ పోర్ట్ ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ తెలిపారు.
Read Also: Champions Trophy 2025: ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత్.. మాజీ ఆటగాడు కీలక వ్యాఖ్యలు