Site icon NTV Telugu

High Court: షాకింగ్.. ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు

Osmania University

Osmania University

High Court: ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల.. హిందీ మహావిద్యాలయ అటానమస్ రిజిస్ట్రార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. గుర్తింపు రద్దు వివాదం నేపథ్యంలో అడ్మిషన్‌ల నిమిత్తం అధికారిక వెబ్‌సైట్‌లో కాలేజీ పేరును చేర్చాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు హైకోర్టు శుక్రవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రిజిస్ట్రార్ కోర్టుకు హాజరై వివరాణ ఇవ్వాలని ఆదేశించింది.

READ MORE: OTR: విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, కైకలూరులో టీడీపీకి ఇంచార్జిల కరువు

కాగా.. హైదరాబాద్ నల్లకుంటలో ఉన్న హిందీ మహా విద్యాలయానికి ఉస్మానియా యూనివర్సిటీ గతేడాది షాక్ ఇచ్చింది. హిందీ మహావిద్యాలయం అనుమతులు రద్దు చేసింది. విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఓయూ విచారణ కమిటీ దర్యాప్తు చేసింది. ఇందులో అక్రమాలు నిజమేనని, అధికారుల సంతకాలు ఫోర్జరీ జరిగినట్లు విచారణ కమిటీ నిర్థారించింది. దీంతో హిందీ మహావిద్యాలయం స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలని యూజీసీకి సిఫార్సు చేసింది. అయితే.. ఆ ఏడాది చదువుతున్న విద్యార్థులకు నష్టం కలగకుండా వారి కోర్సు పూర్తి చేసేందుకు ఓయూ ఛాన్స్ కల్పించింది.

READ MORE: Off The Record: హిందూపురం తమ్ముళ్ల అంతర్మథనం.. అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో వైసీపీ?

Exit mobile version