Sathyam Sundaram : సత్యం సుందరం సినిమాకు ఓటీటీ పార్టనర్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sathyam Sundaram : స్టార్ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో ’96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల కోసం శనివారం (సెప్టెంబర్ 28) థియేటర్లలో విడుదలైంది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీ దివ్య, స్వాతి కొండేటి, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
Read Also:KBR Park: కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్.. త్వరలో అండర్‌పాస్‌లు, ప్లైఓవర్ల నిర్మాణం..
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. టాలెంటెడ్ నటులు కార్తీ, అరవింద స్వామి అద్భుతమైన నటన తమిళ్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ మనసులు దోచుకుంది. మరి బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో ఆకట్టుకోగా ఈ సినిమా ఓటిటి పార్టనర్ సంబంధించి స్పష్టత వచ్చేసింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్ తర్వాత అయితే ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూడవచ్చు. తెలుగు సహా తమిళ్ భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ వారే స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఈ చిత్రానికి గోవింద వసంత బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించగా తెలుగులో రీసెంట్ గా “35 చిన్న కథ కాదు” లాంటి అందమైన చిత్రాన్ని అందించిన నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ సురేష్ ప్రొడక్షన్ నుంచి ఈ సినిమా కూడా రిలీజ్ అయింది.
Read Also:IPL Auction 2025: ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు.. విదేశీ ప్లేయర్లకు నో లిమిట్! ఫుల్ డీటెయిల్స్ ఇవే
ఈ సినిమా కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. కార్తి, అరవింద్ స్వామి పాత్రల మధ్య ఒక రాత్రిలో ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగిందనేది ప్రధాన కథ, కార్తీ అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే, అరవింద్ స్వామి అర్బన్ పర్సనాలిటీగా సినిమాలో కనిపించాడు. ఇక ఈ కథలో గొప్ప విషయం ఒకటుంది. ఏంటంటే.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఫైట్లు, ఇమేజ్‌లు, కామెడీ, లవ్ ట్రాక్‌లు ఇలా ఎక్సట్రా అట్ట్రాక్షన్స్ ఏవీ ఉండవు. మొత్తానికి ఫీల్‌గుడ్ ఎమోషన్తో కట్టిపడేశారు ‘సత్యం సుందరం’.
తాజావార్తలు
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!