NTV Telugu Site icon

Andhra Pradesh: ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రక్రియ ప్రారంభం.. అన్ని శాఖలకు కీలక ఆదేశాలు

Andhrapradesh

Andhrapradesh

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభం అయ్యింది.. బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టాల్సిందిగా అన్ని శాఖల ఉన్నతాధికారులు, హెచ్‌వోడీలకు ఆర్ధిక శాఖ సూచనలు చేసింది.. 2024-25 అంచనాలను ఆర్ధిక శాఖకు పంపాలని అన్ని శాఖలను ఆదేశించింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్ అంచనాలను ఇవ్వాలని పేర్కొంది ఆర్థిక శాఖ. సవరించిన బడ్జెట్ అంచనాలు సమర్పించే సందర్భంలో శాఖలకు కొన్ని కీలక సూచనలు కూడా చేసింది.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చే సవరించిన అంచనాల్లో కొత్త పథకాలు, కొత్త పనులు ప్రతిపాదించొద్దని సూచింది. ఖాళీ పోస్టుల భర్తీ, పోస్టుల అప్ గ్రేడేషన్, కొత్త పోస్టుల సృష్టి వంటి వాటిని సవరించిన అంచనాల్లో ప్రతిపాదించొద్దని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతిపాదనలనూ 2023-24 సవరించిన అంచనాల్లో పొందుపరచొద్దన్న ఆర్థిక శాఖ పేర్కొంది. మళ్లీ ఉత్తర్వులిచ్చేంత వరకు ఈ సూచనలనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.. వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. మూడు లేదా నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. కాగా, ఎన్నికల సంవత్సరంలో ఏ ప్రభుత్వమైనా పూర్తిస్థాయి బడ్జెట్‌ కాకుండా.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టే విషయం విదితమే.

Read Also: Haridwar: “బ్లడ్ క్యాన్సర్” తగ్గాలని 4 ఏళ్ల బాలుడిని గంగలో ముంచిన మేనత్త.. చివరకు..