NTV Telugu Site icon

PCB Files Burning Case: పీసీబీ ఫైల్స్ దహనం కేసు.. పోలీసులకి చుక్కలు చూపిస్తున్న రామారావు..!

Police

Police

PCB Files Burning Case: పీసీబీ ఫైల్స్ దహనం కేసు విచారణలో పోలీసులకి చుక్కలు చూపిస్తున్నాడట OSD రామారావు.. రెండు రోజులుగా రామారావును విచారిస్తున్నారు పోలీసులు.. అయితే, డాక్యుమెంట్స్ పనికిరావని పోలీసులకి విచారణలో చెప్పారట రామారావు.. కానీ, ఆ ఫైల్స్ పడేయాలని చెప్పిన వారి గురించి మాత్రం రామారావు నోరు విప్పటం లేదని సమాచారం.. ప్రభుత్వ డాక్యుమెంట్స్ డిస్పోజ్ చేసేందుకు ఉన్న ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదో కూడా రామారావు చెప్పటం లేదని తెలుస్తోంది.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ లో కొన్ని పీసీబీ వెబ్ సైట్ లో ఓపెన్ డాక్యుమెంట్స్ గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.. ఇక, దహనం చేసేందుకు ప్రయత్నించిన ఫైల్స్ లో కీలకమైనవి ఏమన్నా ఉన్నాయా అనే గుర్తించే పనిలో పడిపోయారు పోలీసులు.. ఇందు కోసం పీసీబీలో ఉన్నతాధికారుల తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.. ఈ వ్యవమారంలో వోఎస్డీ రామారావుపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read Also: BRS MLA Into Congress: కాంగ్రెస్‌ లో చేరిన బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. రేపు మరో నలుగురు..!

కాగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం కేసు కలకలం రేపింది.. ఈ కేసులో ఓఎస్డీ ఎస్వీ రామారావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలను కూడా గన్నవరం తీసుకెళ్లారు పోలీసులు. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసిన రామారావుపై.. గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరోసారి ఫైల్స్ దగ్ధం ఘటనలో రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో చర్చగా మారింది. కృష్ణా జిల్లా యనమలకుదురు సమీపంలోని కరకట్ట రోడ్డు మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన పత్రాలను దగ్ధం చేసిన విషయం విదితమే.. అయితే, పోలీసులు డ్రైవర్ నాగరాజుని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో.. నాగరాజు కీలక విషయాలు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది.