ఈరోజుల్లో రసాయానిక ముందులు వాడేవారి సంఖ్య పెరుగుతుంది.. ఆ రసాయనాలు కూరగాయల తో పాటు మనలోపలకి కూడా వెళతాయి.. దానివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. దిగుబడి పొందాలని రైతులు ఈ మందులనే ఎక్కువగా వాడుతారు.. వ్యవసాయ నిపుణులు సెంద్రీయ వ్యవసాయం చేపట్టాలని సూచిస్తున్నారు.ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే ఆర్గానిక్ పదార్ధాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు.
ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత రసాయన, క్రిమిసంహారక మందులు ఉపయోగించి వ్యవసాయం చేసే పద్దతి వచ్చింది.. ఇప్పుడు అందరు సేంద్రియ ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు.. ఆరోగ్యం బాగుండటంతో పాటుగా అధిక లాభాలను కూడా పొందుతున్నారు.. ఈ వ్యవసాయం తో కలిగే లాభలేమిటో ఇప్పుడు చూద్దాం..
వ్యవసాయ నేల శక్తి పెరుగుతుంది..అలాగే నేలలో హ్యూమస్ నిల్వలు పెరిగి పోషకాలను పంటకు అందిస్తుంది.నీటిని, పోషకాలను నిలువరించే గుణం పెరుగుతుంది.నీటి నిల్వ సామర్ద్యం, మురుగు నీరు పోవు సౌకర్యం కలుగుతుంది.నేల కాలుష్యం తగ్గి నాణ్యతతో కూడిన ఉత్పాదకత జరుగుతుంది.భూగర్బజలాల కాలుష్య నివారణకు దోహదపడుతుంది.. మంచి పోషకాలు ఆహారాన్ని పొందవచ్చు..
సేంద్రియా వ్యవసాయం చేసే పద్ధతులను ఒక్కసారి చూస్తే.. ఈ వ్యవసాయంలో నేలను ఎక్కువగా దున్నకూడదు. ఎక్కువగా దుక్కి దున్నితే నేల కోతకు గురి కావడమే కాక నెలలోని సూక్ష్మజీవులు , ప్లనకాల సంఖ్యా బాగా తగ్గిపోతుంది. అందుకే తక్కువగా దుక్కి దున్నాలి. సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంటలను సాగు చేయాలి. మిశ్రమ పంటలను సాగు చేయడం వల్లన పురుగుల తాకిడి తగ్గించవచ్చు..అదే విధంగా పంట మార్పిడి చేస్తూ ఉండాలి.ఇలా చేయడం వల్ల నేల సారం పెరుగుతుంది. కీటకాలు, పురుగుల నుంచి రక్షణ ఉంటుంది..వృక్ష, జంతువుల ఎరువులను మాత్రమే ఎక్కువగా వాడాలి.. ఇవే ఆరోగ్యానికి కూడా మంచివి..